రాష్ట్రీయం

ఆవిష్కరణల వేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ బృందం తొలి రోజు బిజీ బిజీగా గడిపేసింది. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ప్రమోషన్ చేపట్టింది. తొలి రోజే కార్పొరేట్ సంస్థలకు చెందిన ప్రపంచస్థాయి ప్రతినిధులతో సిఎం చంద్రబాబు ఏపీ ప్రమోషన్‌పై చర్చలు జరిపారు. రక్షణ, వైమానిక, విద్యుత్, ఇంధన, ఆతిథ్య, వైద్యపరికరాల తయారీ, వౌలిక సదుపాయాల కల్పన, బహుళార్ధ ఆర్ధిక సంస్థలు, రవాణా, నౌకాయాన రంగాలు, నౌకాశ్రయ రంగాలు, కన్సల్టింగ్, ఐటి సెక్టార్లలో ప్రపంచ దిగ్గజ సంస్థల అధిపతులతో సిఎం ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ నుండి సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ బృందం అక్కడి నుండి జ్యూరిచ్‌కు మంగళవారం మధ్యాహ్నం చేరుకుంది. జ్యూరిచ్‌లో ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో జరిగిన ఇనె్వస్టర్ల మీట్‌లో చంద్రబాబు బృందం పాల్గొంది. అక్కడ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు పెట్టుబడిదారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి ప్రతినిధి బృందం దావోస్ చేరుకుంది. రాత్రి 10.30కు జరిగే ప్రపంచ ఆర్ధిక సదస్సు స్వాగత సమావేశానికి సిఎం చంద్రబాబు హాజరయ్యారు. సమావేశం బుధవారం వేకువజామున 3.30 వరకూ జరగనుంది. కాంగ్రెస్ సెంటర్‌లో జరిగిన ఇండియన్ కమ్యూనిటీ మీటింగ్‌లోనూ చంద్రబాబు పాల్గొన్నారు. జ్యూరిచ్‌లో తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి సభ జరగ్గా అందులో కూడా చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ వినూత్న ఆవిష్కరణలకు వేదికగా ఉందని, ప్రవాస తెలుగు వారు రాష్ట్రానికి సేవలు అందించడానికి, కొత్త పరిశ్రమల స్థాపనకు ముందుకు రావల్సి ఉందని పేర్కొన్నారు. మియర్ బర్గర్ కంపెనీ ప్రతినిధులతో చాలా సేపు చంద్రబాబునాయుడు జ్యూరిచ్‌లో మాట్లాడారు. రాజమండ్రి, విశాఖపట్టణం నగరాలపై ఆ కంపెనీ ప్రత్యేక శ్రద్ధ వహించినట్టు బృందం సభ్యుడు పరకాల చెప్పారు. ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై మేయర్ బర్గర్ దృష్టిపెట్టిందని అన్నారు. సోలార్ ప్యానల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ స్థాపనకు మియర్ బర్గర్ సంసిద్ధత వ్యక్తం చేసిందని చెప్పారు. ఉత్పత్తుల్లో 50 శాతం ఎగుమతికి అవకాశం ఇవ్వాలని ఆ సంస్థ ప్రతినిధులు సూచించినట్టు తెలిసింది. ఆంధ్రాలో సోలార్ రంగంలో గ్లోబల్ హబ్ ఏర్పాటు చేయడానికి కూడా మియర్ బర్గర్ సంసిద్ధత తెలిపింది. అనంతరం బిహెచ్ ఎం పార్ట్‌నర్స్ గ్రూప్‌తోనూ, ప్లిసమ్ టీమ్‌తోనూ సిఎం భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో 200 మిలియన్ డాలర్ల వ్యయంతో ప్లాంట్ నెలకోల్పడానికి ప్లిసమ్ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. తగిన ప్రతిపాదనలతో రావాలని సిఎం వారికి సూచించారు. అనంతరం న్యూసెచ్ కంపెనీ ప్రతినిధులు సిఎంతో భేటీ అయ్యారు. స్థిరమైన నగరాభివృద్ధి ప్రణాళిక ప్రాజెక్టుల్లో న్యూసెచ్ కంపెనీకి 20 ఏళ్ల అనుభవం ఉందని ఈ క్రమంలో కొత్త రాజధాని అమరావతికి కంపేనీ ఏ విధంగా ఉపయోగపడుతుందో అధ్యయనం చేయాలని అధికారులకు సిఎం సూచించారు. భారత్‌లో పెట్టుబడులకు స్విట్జర్లాండ్ నుండి నిధుల ప్రవాహాన్ని క్రమంగా పెంచాలని ఇనె్వస్టర్లకు సిఎం సూచించారు.
మంగళవారం రాత్రి సిఎం బికెడబ్ల్యు ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. హైట్రోపవర్ జనరేషన్‌పై ఆ కంపెనీ ఆసక్తిని ప్రదర్శించింది. ఎపిలో జలవనరులను విద్యుత్ ఉత్పత్తికి ఎలా వినియోగించాలో అధ్యయనం చేయడానికి రావల్సిందిగా బికెడబ్ల్యు ప్రతినిధులను సిఎం ఆహ్వానించారు. అనంతరం సిఎం ఘెర్జీ సంస్థ ప్రతినిధులతోనూ భేటీ అయ్యారు. ఎపిలో 2వేల కోట్ల రూపాయిలతో మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు ఘెర్జీ ఆసక్తిని కనబరిచింది. పర్యావరణ హితంగా జలవిద్యుత్ ఉత్పత్తిలో పేరుగాంచిన వెర్డి ఇంటర్నేషనల్ ప్రతినిధులు సైతం చంద్రబాబుతో భేటీ అయ్యారు.

చిత్రం... జ్యూరిచ్‌లో ప్రపంచస్థాయ పెట్టుబడిదారులతో సమావేశమైన చంద్రబాబు