రాష్ట్రీయం

దద్దరిల్లిన హెచ్‌సియు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ న్యూఢిల్లీ, జనవరి 19: రీసెర్చ్ స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్య సంఘటనపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ మూడో రోజైన మంగళవారం కూడా విద్యార్ధుల నిరసనలతో దద్దరిల్లిపోయింది. మరో పక్క ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ సహా దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో విద్యార్థులు, దళిత సంఘాలు ధర్నాలు, బైఠాయింపులు, వివిధ రకాల నిరసన, నిరశన కార్యక్రమాలను చేపట్టాయి. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్య్రేయలను తక్షణమే బర్త్ఫ్ చేయాలని డిమాండ్ చేశాయి. పంజాబ్‌లో స్మృతి ఇరాని దిష్టి బొమ్మను ఆందోళనకారులు దగ్ధం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో మంగళవారం వరుస పరిణామాలతో వేడెక్కి పోయింది.
రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తమను పరామర్శించేందుకు వచ్చిన వివిధ పార్టీల నేతల ముందు తమ ఆగ్రహాన్ని చాటిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ క్యాంపస్‌కు రావడంతో విద్యార్ధుల్లో ఒక్కసారి ఉత్సాహం పెల్లుబికింది. మరో పక్క విద్యార్ధులు వర్శిటీ క్యాంపస్‌లోని షాపింగ్ కాంప్లెక్ సమీపంలో రోహిత్ స్మారకస్థూపాన్ని ఏర్పాటు చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కారణాలను విశే్లషించేందుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ నియమించిన కమిటీ సభ్యులు షకీలా శంషు, సూరత్‌సింగ్‌లు వర్శిటీకి వచ్చి విచారణ ప్రారంభించారు. అయితే వారిని విద్యార్ధులు అడ్డుకున్నారు. సీనియర్ ఐఎఎస్‌లతో కూడిన కమిటీని నియమించాలని, నిష్పాక్షికంగా విచారణ జరిపించి రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేయడంతో కమిటీ సభ్యులు అక్కడి నుండి వెనుదిరిగి లేక్‌వ్యూ అతిథి గృహంలో విచారణ చేపట్టారు. బోధనేతర సిబ్బందితోనూ, బోధన సిబ్బందితోనూ కొంత మంది విద్యార్ధులతోనూ ద్విసభ్య కమిటీ సభ్యులు మాట్లాడారు. ఆత్మహత్యకు కారణాలను తెరాస ఎంపీ కొండా విశే్వశ్వరరెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ నియమించిన కమిటీ సభ్యులను కలిసి ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని అన్నారు. డాక్టర్ చుక్కా రామయ్య, మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు క్యాంపస్‌కు వచ్చి విద్యార్ధులను పరామర్శించి మాట్లాడారు.
విద్యార్ధులు మాత్రం యథాప్రకారం మూడో రోజు కూడా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. తరగతులను బహిష్కరించిన విద్యార్ధులు విసిపైనా, ఆత్మహత్యకు కారకులని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయపైనా కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయన్ని కేంద్ర మంత్రివర్గం నుండి బహిష్కరించాలని విద్యార్ధులు డిమాండ్ చేశారు. రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలని, చట్ట ప్రకారం బాధ్యులతో క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు రోహిత్ కుటుంబానికి 50 లక్షలు పరిహారం చెల్లించాలని కోరారు. ఈ సందర్భంగా చుక్కా రామయ్య మాట్లాడుతూ వర్శిటీల అటానమికి భంగం వాటిల్లినపుడు ఇలాంటి సమస్యలే వస్తాయని అన్నారు. ప్రజాస్వామ్య చైతన్యం యూనివర్శిటీల్లో ఉండాలని, ప్రభుత్వం నుండి ఎంత వత్తిడి వచ్చినా దానికి లొంగకుండా వీసీ పనిచేయాలని కాని ప్రస్తుత పరిస్థితి చూస్తే అందుకు భిన్నంగా అనిపిస్తోందని అన్నారు. యూనివర్శిటీ వ్యవహారాల్లో రాజకీయ జోక్యం వల్లనే ఇలా జరిగిందని మల్లేపల్లి లక్ష్మయ్య పేర్కొన్నారు. క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు.

చిత్రం... 1. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగిన యూత్ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు

2. రోహిత్ మృతికి కొవ్వొత్తులతో ఆప్ నేతల నివాళి