రాష్ట్రీయం

నీటి ఎత్తులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 5: శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ రికార్డు స్ధాయిలో 200 టిఎంసికి చేరుకుంది. ఇదే వరద నీటి ప్రవాహం కొనసాగితే, మరో వారం రోజుల్లో పూర్తి స్ధాయి నీటి నిల్వ 215 టిఎంసికి చేరుకుంటుంది. మరో వైపు పోతిరెడ్డి పాడు ద్వారా నీటి తరలింపును నిలుపుదల చేయాలన్న కృష్ణాబోర్డు ఆదేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలంగాణ సాగునీటి ఇంజనీర్లు బోర్డుకు ఫిర్యాదు చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీటి తరలించడం సమంజసమే నంటూ ఆంధ్ర సాగునీటి ఇంజనీర్లు తమ ప్రభుత్వానికి తెలిపారు. ఉభయ రాష్ట్రాలు తమకు అవసరమైన నీటి వివరాలు, ఇంతవరకు వాడుకున్న నీటి పరిణామంపై నివేదికను 10వ తేదీలోగా ఇవ్వాలని బోర్డు కార్యదర్శి ఆదేశించారు. 15న బోర్డు కీలక భేటీ జరుగబోతోంది. శ్రీశైలంలో నీటి నిల్వ 200 టిఎంసికి చేరుకోవడంతో, ఈ నీటిని గరిష్ట స్థాయిలో వాడుకునేందుకు రెండు రాష్ట్రాలు ఎత్తుకు పైఎత్తుతో ముందుకు కదులుతున్నాయి.
నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో 150 టిఎంసి జలాల్లో 112.5 టిఎంసి నికర జలాలను వాడుకునే హక్కు ఆంధ్రప్రదేశ్‌కు ఉందని ఆ రాష్ట్ర సాగునీటి శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. విభజన తర్వాత ఖరారైన నీటి ఫార్ములా ప్రకారం ఆంధ్రకు 512 టిఎంసి నీటి కేటాయింపులున్నాయి. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తీసుకుంటే చౌర్యం కాదని, ఏపి తన ప్రయోజనాల కోసం ఎక్కడినుంచైనా నీటిని డ్రా చేసుకునే హక్కు ఉందని ఏపి జలవనరుల శాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఒప్పందం మేరకు ఆంధ్రకు 512 టిఎంసి, తెలంగాణకు 299 టిఎంసి నీటి కేటాయింపులు జరిగాయన్నారు. ఆంధ్రాకు కేటాయించిన 512 టిఎంసి మిగులు జలాలు కాదని, ఇవన్నీ నికర జలాలని పేర్కొన్నారు. ఈ ఏడాది జూరాల నుంచి శ్రీశైలంకు 234 టిఎంసి నీరు వచ్చాయి. ఇందులో వచ్చిన నీటి ప్రవాహాన్ని బట్టి 75.29 శాతం మేరకు నికర జలాలను వాడుకునే హక్కు ఆంధ్రాకు ఉందని ఏపి జలవనరుల శాఖ ఇంజనీర్లు చెప్పారు. ఇప్పటికిప్పుడు లభ్యతలో ఉన్న నీటిని లెక్కిస్తే ఆంధ్రాకు 112.5 టిఎంసి, తెలంగాణకు 37.5 టిఎంసి నీటిని వాడుకునే హక్కు ఉందన్నారు. వర్షాలు బాగాపడడం వల్ల తెలంగాణలోని చిన్న తరహా చెరువులు నిండాయన్నారు. తెలంగాణకు కేటాయించిన 299 టిఎంసి నీటిలో 89 టిఎంసి మేర చిన్న తరహా నీటి చెరువుల వాటా కూడా ఉందన్నారు. ఈ నీటిని తీసివేస్తే తెలంగాణకు 210 టిఎంసి నీటి కేటాయింపులు ఉన్నాయని ఏపి వాదిస్తోంది. తెలంగాణలో చిన్న తరహా నీటి వనరులను కృష్ణాబోర్డు అధికారులు తనిఖీ చేయాలని ఏపి వాదిస్తోంది. అలాగే కృష్ణాబోర్డు చట్టబద్ధమైన అధికారాన్ని అప్పగించి ఉమ్మడి జలాశయాల పర్యవేక్షణ బాధ్యత ఇవ్వాలని ఏపి జలవనరుల శాఖ మొదటి నుంచి కేంద్రాన్ని కోరుతోంది.