రాష్ట్రీయం

శ్రీశైలం.. నిండుకుండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, అక్టోబర్ 6: శ్రీశైలం జలాశయం నిండుకుండలా తొణికిసలాడుతోంది. మరో మూడు అడుగుల నీరు చేరితో జలాశయం పూర్తిగా నిండుతుంది. 40 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా శుక్రవారం 882.10 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు కాగా ప్రస్తుతం 199.73 టిఎంసిల నీరు ఉంది. జూరాల నుంచి 34 వేలు, రోజా నుంచి 6 వేల క్యూసెక్కులు కలిపి మొత్తం 40,958 క్యూసెక్కుల నీరు జలాశయం చేరుతోంది.