రాష్ట్రీయం

రెండు రోజులు భారీ వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: వచ్చే రెండు రోజులు తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు యాజమాన్య కమిషనర్ కార్యాలయం పేర్కొంది. కాగా శ్రీశైలంలో నీటి నిల్వ 200 టిఎంసికి చేరింది. మొత్తం 215.81 టిఎంసికి 199.73 టిఎంసి నీటి నిల్వలున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 62805 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 15899 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. నాగార్జునసాగర్‌లో 590 అడుగులకు 517.70 అడుగుల నీటిమట్టం చేరింది. 312.05 టిఎంసికి 146.12 టిఎంసి నీరు చేరింది. ఇన్‌ఫ్లోస్ 6455 క్యూసెక్కులు ఉన్నాయి. కాగా ఎగువున ఉన్న ఆల్మట్టి నుంచి 18వేల క్యూసెక్కులు, నారాయణ్‌పూర్ నుంచి 28158 క్యూసెక్కులు, జూరాల నుంచి 48973
క్యూసెక్కుల నీరు వస్తోంది.
రాష్ట్రంలో ఈనెల 5 వరకు సగటు వర్షపాతం 739.5 ఎంఎంకు 680.7 ఎంఎం వర్షపాతం నమోదైంది. మొత్తం -8 శాతం రాష్ట్ర వ్యాప్తంగా నమోదైంది. ఆరు జిల్లాల్లో మేడ్చెల్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, జోగుళాంబ, వనపర్తి, రంగారెడ్డి జిల్లాల్లో 20 శాతం మేర అదనంగా వర్షపాతం నమోదైంది. 17 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 8 జిల్లాలు కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న, మెదక్ జిల్లాల్లో -20 శాతం మేర వర్షపాతం తక్కువగా నమోదైంది. రాష్ట్రంలోని 285 మండలాల్లో సాధారణ వర్షపాతం, 178 మండలాల్లో -20 నుంచి -59 శాతం మేరకు వర్షపాతం నమోదైంది. 120 మండలాల్లో 20 శాతం మేర అదనంగా వర్షపాతం నమోదైనట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 4324402 హెక్టార్లలో 3898070 హెక్టార్లలో ఖరీఫ్ సాగైంది. దాదాపు 90శాతం మేర ఖరీఫ్ సాగైనట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ పేర్కొంది.