రాష్ట్రీయం

సింగరేణిలో గులాబీ రెపరెపలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, అక్టోబర్ 6: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తొమ్మిది ఏరియాల్లో విజయం సాధించి గుర్తింపు సంఘంగా నిలిచింది. 11 ఏరియాల్లో జరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు గట్టి పోటీ ఇచ్చిన ఎఐటియుసి రెండు స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. గురువారం జరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో 15 కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో నిలవగా, కొన్ని సంఘాలకు రెండంకెల ఓట్లు కూడా దాటని పరిస్థితి నెలకొంది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కొత్తగూడెం కార్పొరేట్, కొత్తగూడెం ఏరియా, ఇల్లందు, మణుగూరు, రామగుండం - 1, 2, 3, బెల్లంపల్లి, శ్రీరాంపూర్ ఏరియాల్లో విజయం సాధించింది. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) కూటమి భూపాలపల్లి, మందమర్రి ఏరియాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఎఐటియుసికి ఐఎన్‌టియుసి, టిఎన్‌టియుసి మద్దతు తెలిపినప్పటికీ రెండు స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక్ సంఘ్ (బిఎంఎస్), సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు), హెచ్‌ఎంఎస్ యూనియన్లకు నామమాత్రంగానే ఓట్లు లభించాయి.