రాష్ట్రీయం

మీది పవర్ పంచ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 7: విద్యుత్ రంగంలో ఆంధ్ర సాధించిన విజయాలు దేశానికి దిక్సూచిగా నిలిచిందని కేంద్రం ప్రశంసించింది. తక్కువ చార్జీలకే నాణ్యమైన విద్యుత్ సరఫరా వంటి విధానాలను కేంద్ర మంత్రి అభినందించారు. సోలార్ పంపుసెట్లను, విద్యుత్ నిల్వ వౌలిక సదుపాయాల కల్పనకు నిధుల లోటు భర్తీ, ఇంధన వర్శిటీ ఏర్పాటు విషయంలో పూర్తి మద్దతు ఉంటుందని కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి ఆర్కే సింగ్ శనివారం రాష్ట్రానికి హామీ ఇచ్చారు. విజయవాడ విమానాశ్రయంలో దాదాపు రెండు గంటలపాటు ఇంధన మంత్రి కళా వెంకట్రావు, ఆ శాఖాధికారులతో సమావేశమయ్యారు. విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు మద్దతును కొనసాగించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తినివ్వాలని ఆర్కే సింగ్ అభిప్రాయపడ్డారు. ఆయా రాష్ట్రాలు ఏపీలో అమలవుతున్న అత్యుత్తమ కార్యకలాపాలను అందిపుచ్చుకోవాలన్నారు.
ఆంధ్ర సాఫల్యాలను వివరిస్తూ, ఇతర రాష్ట్రాలు ఏపి విధానాలను అందిపుచ్చుకునేలా ప్రత్యేక నివేదిక రూపొందించాలని రాష్ట్రానికి సూచించారు. ‘ఇంధన రంగంలో ఏపీ ప్రథమ స్థానంలో ఉండటం ప్రశంసనీయం. సిఎం ముందు చూపు అందరికీ ఆదర్శప్రాయం’ అని ఆర్కే సింగ్ అన్నారు. ఈ సందర్భంగా 15వేల నుంచి 30వేల అదనపు సోలార్ వ్యవసాయ పంపుసెట్ల మంజూరుకు అంగీకరించారు. ఏపీ ఇంధన రంగంపై ఇంధన, ఐ అండ్ ఐ, సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఏపీలో 100 శాతం గృహ విద్యుదీకరణ సాధించామని తెలిపారు. కేంద్రం లక్ష్యం కంటే మూడేళ్లు ముందుగానే ఈ ఘనతను రాష్ట్రం సాధించిందన్నారు. పంపిణీ నష్టాలు 9.82 శాతానికి దిగి రావడం దేశంలోనే ప్రథమమన్నారు. ప్రస్తుతం వైజాగ్, తిరుపతిల్లో విద్యుత్ వాహనాలను వాడటం ద్వారా సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచాలనే ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా చేపడతామని వెల్లడించారు. దీంతోపాటే సంప్రదాయేతర విద్యుత్ కొనుగోలు బాధ్యత (ఆర్పీపీఓ) లక్ష్యం 14 శాతం కాగా, దాన్ని అధిగమించి ఏపీ 22 శాతాన్ని సాధించిందన్నారు. ‘అందరికీ విద్యుత్’ కార్యక్రమం కోసం ఏపీని మొదటి రాష్ట్రంగా ఎంపిక చేసినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఎంపీలు కె.హరిబాబు, గోకరాజు గంగరాజు, ఇంధన శాఖ సలహాదారు కె.రంగనాథం, సిఎండి, ఏపీఈపిడిసిఎల్ హెచ్‌వై దొర, ఏపి ట్రాన్స్‌కో జెఎండి ఫైనాన్స్ దినేష్ పరుచూరి, జెఎండి విజిలెన్స్, ఉమాపతి, వైస్ చైర్మన్ ఎండీ, నెడ్ క్యాప్ కమలాకర్ బాబు, జెన్కో, డిస్కంల డైరక్టర్లు ఆదినారాయణ, నాగేశ్వరరావు, పుల్లారెడ్డి, చంద్రశేఖర్, శేషుకుమార్, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..విజయవాడ విమానాశ్రయంలో కేంద్రమంత్రి ఆర్‌కె సింగ్‌కు జ్ఞాపిక అందచేస్తున్న రాష్ట్ర విద్యుత్ మంత్రి కళా వెంకట్రావు