రాష్ట్రీయం

వరద ఉద్ధృతికి నలుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, అక్టోబర్ 7: వరద ఉద్ధృతికి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడిన ఘటన చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఇందులో ముగ్గురి మృత దేహాలు లభ్యం కాగా మరొకరి కోసం గాలింపు కొనసాగుతోంది. మండల సరిహద్దు ప్రాంతమైన తమిళనాడుకు చెందిన వళ్లిమలయార్‌వీడు గ్రామానికి చెందిన పార్తిబన్ (35) టైలర్ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతని భార్య భువన (30), కుమార్తె శే్వత (11), కుమారుడు కదిర్ (8) ఉన్నారు. భువన కూడా చిత్తూరు నగరంలో ఒక ప్రైవేటు దుకాణంలో రోజు వారి కూలీగా పనిచేస్తోంది. అయితే వీరి పిల్లలు తమిళనాడులోని కొత్తూరు గ్రామంలో విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇటీవల దసరా సెలవులు నేపథ్యంలో ఇంటికి పిల్లలను తీసుకు వచ్చారు. తదుపరి సెలవులు అనంతరం పిల్లలతో పాటు భార్యతో కలసి పార్తిబన్ గత శనివారం రాత్రి ద్విచక్రవాహనంలో తమిళనాడులోని కొత్తూరు గ్రామానికి బయలు
దేరాడు, ఈ క్రమంలో మార్గమధ్యమైన పాలసముద్రం మండలం నరసింహాపురం పరిధిలోని చింతమానుమడుగు కాలువలో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ విషయాన్ని గమనించకుండా పార్తిబన్ ప్రయాణిస్తున్న వాహనం కాలువ దాటుతున్న సమయంలో వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. దీనితో నలుగురు గల్లంతు అయ్యారు. అయితే ఇందులో పార్తిబన్, అతని భార్య భువన, కుమార్తె శే్వత మృత దేహాలు శుక్రవారం అర్ధరాత్రి లభ్యంకాగా బాలుడు కదిర్ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ద్విచక్రవాహనం వాగు వద్ద పడి వుండగా దాని రికార్డులు ఆధారంగా మృతుల వివరాలను సేకరించినట్లు ఎస్సై వెంకటేశ్వర్ తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పాలసముద్రం తహశీల్దార్‌కు ఆదేశించినట్లు డి ఆర్ ఓ రజియాబేగం తెలిపారు.