రాష్ట్రీయం

మళ్లీ.. తెరపైకి జోనల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 7: జోనల్ విధానాన్ని రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాన్ని తాజాగా వెనక్కు తీసుకుంది. ప్రస్తుతం ఉన్న జోన్ల సంఖ్యను పెంచేందుకు వీలుగా రాష్టప్రతి కొత్తగా ఉత్తర్వులు జారీ చేయమంటూ కోరాలని ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం శనివారం ప్రగతిభవన్‌లో సమావేశమై ఉద్యోగాల నియామకాలు, జోన్ల అంశం తదితర అంశాలపై కూలంకషంగా చర్చించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల కోసం జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ జారీ చేసిన రాష్టప్రతి ఉత్తర్వులు (371-డి) ని సవరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ అవసరాలకు అనుగుణంగా రాష్టప్రతి ఉత్తర్వులను కొత్తగా జారీ చేయాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతిపాదనలు కేంద్రానికి పంపిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్తగా 21 జిల్లాలు ఏర్పాటు చేశామని, దాంతో మొత్తం 31 జిల్లాలు ఏర్పాటు కావడంతో కొత్త జోన్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్న నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో రెండు జోన్లు మాత్రమే ఉన్నాయని, 31 జిల్లాలకు ఇవి సరిపోవన్న నిర్ణయానికి వచ్చారు. జిల్లా, జోనల్, మల్లీజోనల్, స్టేట్ క్యాడర్ పోస్టులను కొనసాగించాలని నిర్ణయిస్తూ, ఏ పోస్టులు ఏ క్యాడర్‌లో ఉండాలో నిర్ధారించాల్సి ఉందని నిర్ణయించారు.
కొత్త జోన్లను ఏర్పాటు చేస్తే, ఏ ఏ జిల్లాలు ఏ ఏ జోన్ల పరిధిలో ఉండాలో అధ్యయనం చేసేందుకు మంత్రులు, అధికారులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చేసే సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై తీర్మానం చేయాలని నిర్ణయించారు. కొత్త జోన్లకు సంబంధించి ప్రభుత్వం సమగ్రంగా ఒక నివేదిక రూపొందించి కేంద్రానికి పంపిస్తుందని, ఆ తర్వాత కేంద్రంతో తాను స్వయంగా చర్చిస్తానని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్టప్రతి ఉత్తర్వులు ఉన్నా అవి సక్రమంగా అమలు కాకుండా ఆనాటి పాలకులు
అక్రమాలకు పాల్పడ్డారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అలాంటి అక్రమాలు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేసే ఉద్యోగ నియామకాలన్నీ రాష్టప్రతి ఉత్తర్వులకు అనుగుణంగానే జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు. అలాగే విద్యుత్తు, సింగరేణి, ఆర్‌టిసి తదితర ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగాలను రాష్టప్రతి ఉత్తర్వుల పరిధిలోకి తీసుకురావాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ అంశంపై కూడా స్పష్టమైన నిర్ణయాన్ని అధ్యయనం తర్వాతనే తీసుకోవాలని నిర్ణయించారు.
ఏ పోస్టు ఏ క్యాడర్‌లో ఉండాలో నిర్ణయించేందుకు స్పష్టత తీసుకురావాలని నిర్ణయించారు. శాస్ర్తియ విధానంలో నిర్ణయం తీసుకునేందుకు కలెక్టర్లతోనూ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించాలని నిర్ణయించారు.
స్థానికతకు ప్రామాణికత
-----------------
స్థానికతను నిర్ణయించే అంశంపై సమగ్రంగా చర్చ జరపాలని నిర్ణయించారు. విద్యార్థి చదువుకున్న స్థానాన్ని అనుసరించి స్థానికత నిర్ణయించడం సబబు కాదని, ఈ విధానంలో మార్పులు, చేర్పులు తెచ్చేందుకు కమిటీ అధ్యయనం చేసి సిఫార్సులు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా క్యాడర్‌కు కొత్త జిల్లాలే ప్రాతిపదిక
-------------------------------
జిల్లా క్యాడర్ పోస్టులను భర్తీ చేసేందుకు కొత్త జిల్లాలనే ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయించారు. డిఎస్‌సి నోటిఫికేషన్ కూడా కొత్త జిల్లాల వారీగా జారీ చేయాలని నిర్ణయించారు. ఎస్‌సి, ఎస్‌టి బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సంబంధిత మంత్రులు, అధికారులను ఆదేశిచారు. ప్రతినెలా చివరిరోజున సమావేశమై ఈ అంశంపై చర్చించాలని ఎస్‌సి అభివృద్ధి మంత్రి జగదీష్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్‌లకు సూచించారు.
ఉన్నతస్థాయి కమిటీ
-------------
తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా రాష్టప్రతి ఉత్తర్వులు జారీ చేసేందుకు వీలుగా ముసాయిదా రూపొందించేందుకు మంత్రులు, అధికారులతో కూడిన కమిటీని నియమించారు. ఈ మేరకు శనివారం ప్రత్యేకంగా ఒక జీఓ కూడా జారీ చేశారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో మంత్రులు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, టి. హరీష్‌రావు సభ్యులుగా ఉంటారు. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్‌తో పాటు సీనియర్ అధికారులు రంజీవ్ ఆర్ ఆచార్య, ఎస్‌కె జోషి, అజయ్‌మిశ్రా, సురేష్ చందా, బిఆర్ మీనా, వి. నిరంజన్‌రావు సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి (పొలిటికల్) అధర్ సిన్హా ఈ కమిటీ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారని ప్రకటించారు.