రాష్ట్రీయం

పోలీసులకు శుభవార్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 7: ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న పోలీసు అధికారుల పదోన్నతి అంశాన్ని ముఖ్యమంత్రి శనివారం పరిష్కరించారు. దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి, న్యాయ శాఖ అధికారులు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులతో అనేక దఫాలుగా చర్చలు జరిపి ఒకేసారి ఏకంగా 275మందికి నాన్ కేడర్ ఎస్పీలుగా, ఏఎస్పీలుగా, డిఎస్పీలుగా పదోన్నతులు కల్పంచాలని నిర్ణయించారు. దీంతో 1994 బ్యాచ్ వరకు ప్రతి పోలీసు అధికారికి పదోన్నతి లభిస్తుంది. దీనికి సంబంధించిన ఫైలుపై ప్రగతిభవన్లో సిఎం కె చంద్రశేఖరరావు శనివారం ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, తుమ్మలనాగేశ్వరరావు, ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, డిజిపి అనురాగ శర్మ, అడ్వకేట్ జనరల్ ప్రకాశ్ రెడ్డితో చర్చించారు. పోలీసు పదోన్నతుల విషయంలో తమకు అన్యాయం జరుగుతున్నదని, చాలామంది ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. కొందరు కోర్టులను ఆశ్రయంచారు. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల దాగా పలువురికి వినతులు ఇచ్చారు. సమైక్య రాష్ట్రంలోనే పదోన్నతుల విషయంలో వివక్ష, గందరగోళం జరిగిగింది. ఈ సమస్యను పరిష్కరించి పదోన్నతుల్లో పారదర్శకత పాటించాలని సిఎం దృఢ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అడ్వకేట్ జనరల్ అభిప్రాయం కూడా తీసుకుని వివాదాలకు తావులేని విధంగా సమస్యను పరిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 139 మంది సిఐలకు డిఎస్పీలుగా, 103 మంది డిఎస్పీలకు ఏఎస్పీలుగా, 33 మంది ఏఎస్పీలకు నాన్ కేడర్ ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసకున్నారు. 1994 బ్యాచ్ వరకు ఉన్న పదోన్నతి కోసం వేచి చూస్తున్న సిఐలందరికీ పదోన్నతి కల్పించిన వారితో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని అవసరమనుకుంటే సూపర్‌న్యూమరీ పోస్టులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ప్రకటించారు. జోన్లవారీగా నియామకాలు జరిగినప్పటికీ రాష్ట్ర స్ధాయి కేడర్‌కు పదోన్నతి కల్పించే విషయంలో జోన్ల నిష్పత్తి పాటించాల్సిన అవసరం ఉంది. కాని అలా జరగలేదు. గతంలో ఇనెస్పెక్టర్ స్ధాయి నుండి డిఎస్పీ స్ధాయి వరకు పదోన్నతులు ఇచ్చినప్పుడు జరిగిన తప్పొప్పులను సరిదిద్ది ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలన్నారు. అవసరమైన చోట సూపర్ న్యూమరీ పోస్టులను ఏర్పాటు చేయడం వల్ల వరంగల్ జోన్‌లో ఇనెస్పెక్టర్లకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దవచ్చని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు.