రాష్ట్రీయం

నైరుతి.. తిష్టవేసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 8: తెలంగాణలో నైరుతి రుతుపవనాలు తిష్టవేశాయి. నైరుతీ రుతుపవనాలు (సౌత్‌వెస్ట్ మాన్‌సూన్) ఇప్పటికే రాష్ట్రం నుంచి వెళ్లిపోయి, ఈశాన్య రుతుపవనాలు (నార్త్-ఈస్ట్ మాన్‌సూన్) ప్రారంభం కావల్సి ఉన్నప్పటికీ, అది జరగలేదు. సీజన్ చివరిలో తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏటా జూన్ నుండి సెప్టెంబర్ చివరి వరకు అంటే నాలుగు నెలలపాటు నైరుతి రుతుపవనాలు తెలంగాణలో కీలక భూమిక పోషిస్తాయి. ఈ నాలుగు నెలల కాలంలో రాష్ట్రంలో సరాసరి వర్షాపాతం 720 మిల్లీమీటర్లుగా నమోదవుతుంది. ఒక్కో పర్యాయం ఇంతకుమించి వర్షం కురుస్తుంది. మరికొన్ని సందర్భాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సీజన్‌లో 620 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాస్త తక్కువ ఐనప్పటికీ, ఇది సాధారణ వర్షపాతంగానే భావిస్తుంటారు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఈ ఏడాది చెరువులు, కుంటల్లోకి బాగా నీళ్లు చేరుకున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్ దాదాపు పూర్తిస్థాయిలో
నిండింది. దాంతో శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను తెలంగాణలోని మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూలు, రంగారెడ్డి జిల్లాలకు ఇప్పుడు తరలిస్తున్నారు. దాంతో ఆయా జిల్లాల్లోని ప్రజల్లో ఆనందం తాండవిస్తోంది.
నైరుతీ రుతుపవనాల వల్ల వచ్చే వర్షంతో తెలంగాణలోని దాదాపు 40 లక్షల ఎకరాల్లో మెట్టపంటలు వేస్తారు. మెట్టపంటలైన జొన్న, సజ్జ, తైదలు, ఆముదం, కందులు, పెసళ్లు, మినుములు, ఉలవలు, పల్లీ, పొద్దుతిరుగుడు, కుసుమ, సోయా, పత్తి, మిరప, ఉల్లి తదితర పంటలు వేస్తారు. వరి ఒక్కటే సాగునీరు అందుబాటులో ఉండే చెరువులు, కుంటలు, కాలువలు, బావులు, బోర్‌బావుల కింద పండిస్తారు. ఈ ఏడు 18 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. ఈశాన్య రుతుపవనాలపై ఆధారపడి తెలంగాణ రైతులు పంటలు వేయడం లేదు. వానాకాలం పంటలు పూరె్తైన తర్వాత యాసంగి పంటలు వేస్తారు. యాసంగి పంటలు నవంబర్- డిసెంబర్‌లో ప్రారంభమవుతాయి. మార్చిలో పంటలు కోతకు వస్తాయి. వానాకాలం పంటలు ఇప్పుడు చేతికి వస్తున్నాయి. నెలరోజుల్లో యాసంగి పంటలు షురూ అవుతాయి.
హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్‌లో గత మూడురోజుల నుండి భారీగా వర్షం కురుస్తోంది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రాజధాని నగరం యావత్తూ వర్షం కురిసింది. శనివారం రెండు సెంటీమీటర్ల నుండి ఏడు సెంటీమీటర్ల వరకు వాన కురవగా, ఆదివారం వివిధ ప్రాంతాల్లో రెండు సెంటీమీటర్ల నుండి ఎనిమిది సెంటీమీటర్ల వరకు వాన కురిసిందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూలు, నల్లగొండ, మెదక్ తదితర జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఈ వానలు కురుస్తున్నాయని ఐఎండి వెల్లడించింది.