రాష్ట్రీయం

విజ్ఞాన ఖని.. ఏపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 9: ప్రపంచంలోనే ఆంధ్ర నాలెడ్జ్ హబ్‌గా రూపుదిద్దుకోబోతుందని సిఎం చంద్రబాబు అన్నారు. సోమవారం బ్లాక్‌చైన్ బిజినెస్ కాన్ఫరెన్స్‌ను ప్రారంభించిన సందర్భంలో మాట్లాడుతూ ప్రస్తుతం నాలుగో పారిశ్రామిక విప్లవం పరుగులు తీస్తోందని, ఇందులో భాగమే ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ అన్నారు. ఆధునిక సాంకేతికత ఆధారంగా రియల్‌టైం గవర్నెన్స్‌ను తమ ప్రభుత్వం అందిస్తోందని, దీనివలన పాలన సరళతరమైందన్నారు. రాష్ట్రానికి 660 కోట్ల పెట్టుబడులతో 100 ఐటి కంపెనీలు రానున్నాయని, 5000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, వీటికోసం 14 సెజ్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సాంకేతికత పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని, వీరికి కళ్లెం వేసేందుకు బ్లాక్‌చైన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు చెప్పారు.
బ్లాక్‌చైన్ టెక్నాలజీ నమ్మకమైనది, సేఫ్టీ, సెక్యూరిటీతో కూడినదని, రియల్‌టైం గవర్నెన్స్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. బ్లాక్‌చైన్ టెక్నాలజీతో అద్భుతాలు సృష్టించవచ్చని చెబుతూ, భవిష్యత్ తరాలకు అత్యాధునిక పరిజ్ఞానాన్ని అందించడానికి అవకాశం ఏర్పడుతుందని వివరించారు. బ్లాక్‌చైన్ టెక్నాలజీకి విశాఖ రాజధానిగా మారబోతుందని, విశాఖ ఫిన్‌టెక్ సిటీలో బ్లాక్‌చైన్ టెక్నాలజీ స్టార్టప్ కంపెనీలు భాగస్వాములైతే ప్రపంచ దేశాలన్నీ విశాఖ వైపే చూస్తాయని జోస్యం చెప్పారు. విశాఖలో ఫిన్‌టెక్ టవర్ రూపుదిద్దుకుంటోందని, తొమ్మిది ప్రముఖ ఐటి కంపెనీలు విశాఖలో పెట్టుబడులు పెట్టాయని, మరో 16 కంపెనీలు విశాఖకు వస్తున్నాయన్నారు. గ్లోబల్ ఫిన్‌టెక్ అవార్డు, ఇండియన్ ఫిన్‌టెక్ ఛాలెంజ్ అవార్డులను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. విశాఖలో హ్యక్‌థాన్ పేరుతో ప్రతినెల ఒక అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించనున్నామని, వచ్చేనెల 15 నుంచి విశాఖలో జరగనున్న అంతర్జాతీయ వ్యవసాయ సదస్సుకు బిల్‌గేట్స్ వస్తున్నారని చెప్పారు. ఈ సదస్సులో వరల్డ్ ఎకనమిక్
ఫోరంను కూడా భాగస్వామిగా చేస్తున్నామని చంద్రబాబు వివరించారు.
మీ ఉత్పత్తులకు నేను మార్కెట్ చేస్తా
ఆంధ్రలో ఏ కంపెనీ పెట్టినా, వాటి ఉత్పత్తులకు మార్కెట్ చేయడం గురించి యాజమాన్యాలు ఆలోచించనక్కర్లేదు. తానే మార్కెటింగ్ మేనేజర్‌గా వ్యవహరించి, ఉత్పత్తులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అమ్ముడయ్యే బాధ్యత తీసుకుంటానని చంద్రబాబు చెప్పారు. కొత్త ఆలోచనలతో స్టార్టప్ కంపెనీలు ఏపీకి రావాలని తాను కోరుకుంటున్నానని చంద్రబాబు చెప్పారు. పారిశ్రామికవేత్తలు ఎక్కడివారైనా, ఏపీని రెండో ఇంటిగా భావించాలని చంద్రబాబు సూచించారు.
ఎన్నికలంటే భయంలేదు
సదస్సులో సిఎం చంద్రబాబు రియల్‌టైం గవర్నెన్స్ గురించి దేశ, విదేశ ప్రతినిధులకు వివరిస్తున్నప్పుడు ఆయన విషయాన్ని కాస్త రాజకీయాల వైపు మళ్లించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కనీసం 80 శాతం సంతృప్తి చెందేలా పాలన సాగిస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఈ 80 శాతం మంది తనకు ఓటు వేస్తే చాలన్నారు. ఎన్నికలంటే తను ఎప్పుడూ భయపడనని చంద్రబాబు చెప్పారు. తనకు ప్రభుత్వం, ప్రజలే ముఖ్యమని, ఎన్నికలు ఉప ఉత్పత్తి వంటిది మాత్రమేనన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర ప్రభుత్వ ఐటి సలహాదారు జెఎ చౌదరి, ఉదయ్ చైర్మన్ జె సత్యనారాయణ, నాస్కం చంద్రశేఖర్, కాండింట్ సిఇఓ అశోక్ వేమూరి, సింపూర్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ రవి మీనన్, ఎంపీలు హరిబాబు, అవంతి శ్రీనివాసరావు, మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు.

చిత్రం..బ్లాక్‌చైన్ టెక్నాలజీ వ్యాపార సదస్సులో మాట్లాడుతున్న సిఎం చంద్రబాబు