రాష్ట్రీయం

పెట్రోల్ బంకుల్లో అక్రమాలపై పోరాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 8: పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న కొలతల అక్రమాలు, కల్తీలపై యువత, వాహన యజమానులు ఖర్చు లేని లీటర్ క్యాన్లు, టిష్యూ కాగితాలతో పోరాడాలని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ పిలుపునిచ్చారు. ఒక్క హైదరాబాద్‌లోనే పెట్రోల్ అక్రమాల విలువ రోజుకు రూ.1.5 కోట్లు ఉంటుందని, ఈ అక్రమాన్ని అడ్డుకునేందుకు పోరాడాలని అన్నారు. ఈ తరం వినూత్న ఉద్యమంగా పార్టీలకతీతంగా చేస్తున్న 100 రోజుల ‘జనం కోసం జెపి’ సురాజ్య యాత్రలో ‘యూత్ ఫర్ బెటర్ ఇండియా డాట్‌కామ్, సిటిజన్స్ ఫర్ బెటర్ ఇండియా డాట్ కామ్’ వెబ్ ఫ్లాట్‌ఫాంల ద్వారా ఇప్పటి వరకు నమోదైన కార్యకర్తలతో తొలి కార్యక్రమాన్ని జెపి హైదరాబాద్ వెబ్ ద్వారా ప్రారంభించారు. అనంతరం ఆ వివరాలను లోక్‌సత్తా వర్గాలు విలేకరులకు వివరించారు. ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర వాహన యజమానులు తమ వాహనానికి పోయించుకోవాలనుకునే పెట్రోల్ లీటర్, రెండు, ఐదు లీటర్లయితే సరిపడా క్యాన్ తీసుకెళ్లి కొలత చూసుకుని పోయించుకుంటే మంచిదని అన్నారు. ఇలా అలావాటు చేస్తే కొన్ని కోట్లు అక్రమార్జనకు అడ్డుకట్ట వేసినవాళ్లం అవుతామని అన్నారు. దీన్ని విస్తత్రంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ఈ నెల 9 నుంచి విజయనగరం, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో జనం కోసం జెపి సురాజ్య యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ యాత్రలో ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు వాటిని ప్రజల మధ్య తెలుసుకుని పరిష్కార మార్గాలను తెలుసుకుంటామని తెలిపారు. వెబ్ వేదికగా ప్రజలు తమ సమస్యలను తెలియజేవచ్చని సూచించారు.