రాష్ట్రీయం

బిసిల వాటా తేల్చాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 8: తెలంగాణలో బిసిలకు సామాజిక న్యాయం, సమాన వాటా దక్కాలనే ప్రధాన డిమాండ్‌తో లక్ష మంది విద్యార్థులతో డిసెంబర్ 20న హైదరాబాద్‌లో బిసి విద్యార్థి మహా గర్జన నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆదివారం స్ధానిక బిసి భవన్‌లో జరిగిన బిసి విద్యార్థి సంఘాల రాష్ట్ర స్థాయి అత్యవసర సమావేశానికి బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.లింగం అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బిసి విద్యార్థులకు ర్యాంకుతో సంబంధం లేకుండా ఫీజురియంబర్స్‌మెంట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బడుగు బలహీన వర్గాల విద్యార్థులు వందలాది మంది ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర జనాభాలో 50 శాతంపైగా జనాభా ఉన్న బిసిలకు తగిన వాటా దక్కే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 20న జరిగే బిసి విద్యార్థి మహా గర్జన చరిత్రలో నిలిచిపోయేవిధంగా ఉండాలని అన్నారు. ఇందుకు బిసి విద్యార్థులు రాష్ట్రం నలుమూలల నుంచి తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.