రాష్ట్రీయం

మోదీ సర్కారువి ప్రజా వ్యతిరేక విధానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 8: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయాలన్నీ ప్రజా వ్యతిరేక విధానాలేనని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు, మా జీ ఎంపి కెఈ ఇస్మాయిల్ ఆరోపించారు. కేంద్ర ప్రభు త్వ తీసుకున్న నిర్ణయాల వల్ల ఆర్థిక వృద్ధి రేటు క్షీణించడం, అసహనం, నిరుద్యోగుల సంఖ్య పెరగడం, ధర ల పెరుగుదల వంటివి చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. ఆదివారం నాడిక్కడ మఖ్ధుం భవన్‌లో జరిగిన యూనియన్ జాతీయ స్థాయి సమావేశానికి ఇస్మాయిల్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో దళితులు, బలహీన వర్గాలపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ బిజెపితో కలిసి అనేక అరాచకాలు సాగిస్తోందని, ప్రభు త్వ వైఫల్యాలు బయటకు రాకుండా ఏదో ఒక రకమైన అలజడి సృష్టించి ప్రజల దృష్టి మళ్లించే విధంగా చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి యూనియన్ సభ్యు లు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి హాజరయ్యారు.