రాష్ట్రీయం

వెంకన్నను దర్శించుకున్న సిరిసేన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 8: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆదివారం తెల్లవారుజామున సతీ సమేతంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. రాంభగీచా అతిథిగృహం వద్దకు చేరుకున్న మైత్రిపాల సిరిసేనకు జెఇఓ కెఎస్ శ్రీనివాసరాజు స్వాగతం పలికారు. అక్కడ నుంచి బ్యాటరీ కారులో వారు ఆలయ మహాద్వార సమీపానికి చేరుకున్నారు. రెడ్‌కార్పెట్ స్వాగతం ఏర్పాటు చేసిన నేపథ్యంలో మైత్రిపాల సేన ఆలయ మహాద్వారం వద్దకు రాగానే ఇఓ సింఘాల్ ఆయనను సాదరంగా ఆహ్వానించి ఆలయంలోకి తీసుకువెళ్లారు. సుప్రభాత సేవలో పాల్గొన్న అనంతరం మైత్రిపాల సిరిసేన దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారి వైభవాన్ని, ఆభరణాల విశేషాలను మైత్రిపాల సిరిసేనకు వివరించారు. అనంతరం సంపంగి ప్రాకారం ప్రదక్షిణగా వచ్చి విమాన వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం సబేరా రూంలో స్వామివారి వస్త్రాలను కళ్లకు అద్దుకున్నారు. అక్కడ నుంచి హుండీ వద్దకు వచ్చి కానుకలను సమర్పించారు. అనంతరం ధ్వజస్తంభానికి నమస్కరించుకుని రంగనాయక మండపం చేరుకున్నారు. రంగనాయక మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టిటిడి ఇఓ అనిల్‌కుమార్ సింఘాల్, జెఇఓ శ్రీనివాసరాజు కలసి శ్రీలంక్ష అధ్యక్షునికి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం, 2018 క్యాలెండర్, డైరీలను అందజేశారు. ఆ తరువాత శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన దంపతులు ఆలయం నుంచి శ్రీపద్మావతి అతిథిగృహానికి చేరుకుని అల్పాహారం అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు.