రాష్ట్రీయం

శ్రీశైలం డ్యాంకు పెరిగిన వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, అక్టోబర్ 8: శ్రీశైలం జలాశయంలోకి చేరుతున్న వరద నీటి ప్రవాహం ఆదివారం కొంతమేరకు పెరిగినట్లు డ్యాం అధికారులు తెలిపారు. ఇక జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ఆదివారం సాయంత్రం సమయానికి 882.8 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు కాగా ప్రస్తుతం 203.4290 టిఎంసిలుగా నమోదైంది. ఎగువన ఉన్న జూరాల నుంచి 32 వేల క్యూసెక్కులు, రోజా ప్రాజెక్టు నుంచి 35,832 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతుంది. మొదటి పవర్ జనరేషన్ ద్వారా 31,414 క్యూసెక్కుల నీరు, రెండవ పవర్‌హౌస్ ద్వారా 28,251 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు 6 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 2025 క్యూసెక్కులు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌కు 1600 క్యూసెక్కులు నీరు పోతుంది. ఉష్ణోగ్రతల వల్ల 88 క్యూసెక్కుల నీరు జలాశయం నుంచి ఆవిరైనట్లు డ్యాం అధికారులు తెలిపారు.