రాష్ట్రీయం

మావోల దళపతిగా నంబాల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 8: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నాయకత్వ మార్పిడికి కసరత్తు చేపట్టినట్టు తెలుస్తోంది. పార్టీలో నాయకత్వం మార్పుపైనే దృష్టి సారించిన కేంద్ర కమిటీ మావోయిస్టు దళపతిగా పార్టీలో రెండో స్థానంలో ఉన్న నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్‌ను నియమించే అవకాశాలు మెండుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల పోలీసులకు లభించిన కీలక పత్రాల ఆధారంగా పార్టీ నాయకత్వం మారనున్న అంశం వెల్లడైనట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న పార్టీ నాయకత్వంలో అగ్ర నాయకత్వం అనారోగ్యం, వయసు పైబడడం కారణాలతోనే పార్టీలో నాయకత్వ మార్పు చోటుచేసుకుంటున్నట్టు తెలిసింది. పార్టీలో నూతన నాయకత్వం తొలుత రిక్రూట్‌మెంట్, ఆ తరువాతే పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది. ఒడిశా-తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కార్యకలాపాలు పెరగడం వల్ల పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు గాలింపు ముమ్మరం చేసిన నేపథ్యంలో మావోయిస్టులకు చెందిన పలు కీలక పత్రాలు పోలీసులకు లభించినట్టు సమాచారం. కేంద్ర కమిటీ నూతనంగా నియమించే కమిటీలో యువకులకు, దళితులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలిసింది. కాగా నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్‌ను కేంద్ర కమిటీ కార్యదర్శిగా నియమించవచ్చని తొలుత ప్రచారం జరిగింది. కానీ పార్టీలో ఇటీవలి పరిణామాలతో పాటు దళిత వర్గానికి చెందిన వారికి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని ప్రతిపాదనల నేపథ్యంలో జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన పిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీకి పార్టీ పగ్గాలు అప్పగించనున్నట్టు కూడా వినిపించింది. అయితే నంబాల కేశవరావు పేరు తెరపైకి వచ్చిందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఎంసిఐ నుంచి వచ్చిన ప్రశాంత్ బోస్, చత్తీస్‌గఢ్‌కు చెందిన హిడుమ అలియాస్ వినోద్‌ల పేర్లు కూడా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
కొండపల్లి సీతారామయ్య స్థానంలో సిపిఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ ప్రధాన కార్యదర్శిగా 1992లో గణపతి బాధ్యతలు చేపట్టారు. తరువాత 2004లో విప్లవ సంస్థలన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా కూడా ఆయన కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయనకు వయసు మీద పడటం, అనారోగ్యం కారణంగా కార్యదర్శి పదవి నుంచి తప్పుకోవాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 2007లో మావోయిస్టు పార్టీ నిర్వహించుకున్న ప్లీనరీ సందర్భంగా నాయకత్వం వహించే వారి వయసు 60 ఏళ్ల వరకే ఉండాలన్న చర్చ జరిగిందని, ఇప్పుడా అంశాన్ని పరిగణనలోకి తీసుకుని గణపతి స్థానంలో కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోనున్నట్టు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అప్పట్లో కేంద్ర కమిటీలో ఉన్న నంబాల కేశవరావు, ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఆజాద్ అలియాస్ చెరుకూరి రాజ్‌కుమార్, ప్రస్తుతం జైలులో ఉన్న కోబాడ్ గాంధీలలో ఒకరు కార్యదర్శిగా ఎంపిక కావచ్చని ప్రచారం సాగింది. అదేవిధంగా వీరితోపాటు పార్టీ కేంద్ర కమిటీలో సభ్యులుగా కటకం సుదర్శన్, మల్లా రాజిరెడ్డి, వేణుగోపాల్‌రావు, అక్కిరాజు హరగోపాల్, మోడెం బాలకృష్ణ, ఒగ్గు సత్యాజీ, రావుల శ్రీనివాస్, పిప్పిరి తిరుపతి, జినుగు నర్సింహారెడ్డిలతో పాటు బీహార్‌కు చెందిన మరో పది మంది సీనియర్ నాయకులు ఉన్నారు. మొత్తంగా వీరందరూ 50 ఏళ్ల పైబడినవారే. 12 మందికి 60 ఏళ్ల వయసు కూడా నిండి ఉన్నట్టు తెలుస్తోంది.