రాష్ట్రీయం

వేషాలేస్తే.. జీరోలను చేస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 10: మీరెవరైనా హీరోలనుకుంటే జీరోలను చేయడం నాకు ఐదు నిమిషాల పని. ఒక రాష్ట్ర సీఎంకు ఎంత వరకూ మర్యాదలివ్వాలో అంతవరకే ఇవ్వాలి. అది నేనిచ్చాను. మరీ రాసుకుని పూసుకుంటే ఆ రాష్ట్రంలో ఉన్న మన పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్లవా. మీ వ్యక్తిగత ప్రవర్తన, వ్యవహారశైలికి సంబంధించిన జాతకాలన్నీ నా దగ్గర ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో సీట్లు గ్యారంటీ అనుకోవద్దని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలను హెచ్చరించారు. మంగళవారం సచివాలయంలో మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇటీవల అనంతపురం జిల్లా వెంకటాపురంలో మంత్రి పరిటాల సునీత కుమారుడి పెళ్లికి హాజరైన తెలంగాణ సీఎంకు అతిగా మర్యాదలు చేసి విధేయత ప్రదర్శించిన వైనం, పయ్యావుల కేశవ్‌ను కేసీఆర్ పక్కకు తీసుకువెళ్లి మాట్లాడిన ఘటనపై తెలంగాణ నేత రేవంత్‌రెడ్డి చేసిన విమర్శలను బాబు ఈ సమావేశంలో ప్రస్తావించినట్టు తెలిసింది. పొరుగు సిఎం మన రాష్ట్రానికి వస్తే కచ్చితంగా గౌరవించాలి. పెళ్లికి వచ్చిన కేసీఆర్‌ను నేను గౌరవించా. కానీ మీలో కొందరు ఆయనతో ఎక్కువగా రాసుకుని పూసుకుని తిరగడం, పక్కకుతీసుకువెళ్లి మాట్లాడటం ఏమిటి? నేనే అక్కడ అర్ధగంట ఉంటే మీకు అక్కడ గంటలపాటు ఏం పని? ఆ పార్టీపై పక్క రాష్ట్రంలో
మన వాళ్లు ఓ వైపు పోరాడుతుంటే, మీరిక్కడ ఆయనకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి అతిగా వ్యవహరించడంవల్ల ఎలాంటి సంకేతాలు వెళతాయో ఆలోచించాల్సిన అవసరం లేదా? ఎందుకంత ఓవరాక్షన్ అని హెచ్చరించినట్టు సమాచారం. ఇదంతా కేశవ్ గురించేనన్న చర్చ పార్టీ నేతల్లో జరిగింది. అయితే కేశవ్ నేటి సమావేశానికి హాజరుకాలేదు.
పవన్ కల్యాణ్ ఎవరో తెలియదన్న కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు, జనసేనను పట్టించుకోబోమన్న రాష్టమ్రంత్రి పితాని వ్యాఖ్యలపైనా బాబు అసహనం వ్యక్తం చేశారు. దానికి కేంద్రమంత్రి అశోక్ సమాధానమివ్వబోగా అడ్డుకుని ‘ఆయన మీ కామెంట్లతో బాగా హర్టయ్యారు. అది మంచిది కాదు. మన పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అతను ముందుకొచ్చి సాయం చేశారు. అతని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? సాయం చేసిన వ్యక్తిపై కామెంట్లు చేయడం కరెక్టు కాదు. ఇకపై అందరూ ఇలాంటి పరిస్థితి ఎదురవకుండా చూసుకోం’డని స్పష్టం చేశారు. ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు మంచి స్పందన లభిస్తోందని నాయకులను అభినందించారు. ఇనే్నళ్లయినా కృష్ణా జిల్లా, విజయవాడలో పార్టీ ఆఫీసు ఎందుకు నిర్మించలేకపోయారని మంత్రి దేవినేని ఉమ, కొల్లు రవీంద్రపై బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. దానితో దేవినేని ఉమ మీకు చెప్పి చేద్దామనుకున్నామని వివరణ ఇవ్వబోగా అన్నీ నీ ఇష్టం వచ్చినట్లు చేసుకుని ఇప్పుడు నా అనుమతి అడుగుతున్నావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమలో గతంలో ఎప్పుడూ లేనంత వర్షాలు, అనంతలో తొలిసారి వరదలు రావడంపై బాబు సంతోషం వ్యక్తం చేశారు. మనం జలసిరికి హారతి ఇచ్చి సంకల్పం చెప్పుకున్నందుకే ఇంత భారీ వర్షాలు పడ్డాయి. మనం సరిగ్గా పనిచేస్తే రాష్ట్రంలో ఇక ప్రతిపక్షం అవసరం లేదని వ్యాఖ్యానించారు.