రాష్ట్రీయం

వచ్చేది.. గ్లోబల్ ఫార్మా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మాసిటీని రాష్ట్రంలో నెలకొల్పడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె తారకరామారావు అన్నారు. ఫార్మారంగంలో హైదరాబాద్ ప్రస్తుతం అగ్రస్థానంలో నిలిచిందని, ఫార్మాసిటీ ఏర్పాటుతో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంటుందన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటుపై అధికారుల బృందం దేశ విదేశాల్లో అన్ని కోణాల్లో అధ్యయనం చేసి వచ్చిందన్నారు. ఫార్మాసిటీవల్ల కాలుష్యం తప్పదన్న కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని మంత్రి ఖండించారు. వేర్వేరు ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయడంవల్ల అదనంగా డబ్బు ఖర్చు అవడంతో పాటు కాలుష్యం కూడా పెరిగిందన్నారు. ఒకేచోట వీటిని ఏర్పాటు చేయడం వల్ల డబ్బు ఆదాతోపాటు కాలుష్యాన్ని నియంత్రించవచ్చని మంత్రి కెటిఆర్ అభిప్రాయపడ్డారు. హెచ్‌ఐసిసిలో మంగళవారం ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (్ఫక్కీ) ఆధ్వర్యంలో ‘సాంకేతికత స్వీకరణ, తెలంగాణ పరివర్తన’ అంశంపై ఏర్పాటు చేసిన సదస్సును మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఫార్మాసిటీ ఏర్పాటుతో కాలుష్యం ఏర్పడుతుందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పారిశ్రామిక కాలుష్యమనేది సాంకేతికత అంతగా అభివృద్ధి చెందనప్పుడు జరిగేదని, రానురాను కాలుష్యరాహిత్య పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందన్నారు. ఔషదాల తయారీలో భారత్ వెనుకబడి ఉందని, ఇప్పటికీ 84శాతం మందుల ముడి సరుకులను చైనా, ఐరోపా, అమెరికా నుంచి దిగుమతి అవుతున్నాయన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటు చేశాక మందుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయన్నారు. ఫార్మాసిటీ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 4.2 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఉద్యోగాలలో స్థానికులకు ప్రాధాన్యత కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుదని మంత్రి హామీ ఇచ్చారు. ఒకేసారి 19 వేల ఎకరాల్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని, దశలవారీగా విస్తరిస్తామన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటుతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందేమోనని విపక్షాలు భయపడుతు న్నాయని, ఆ భయంతోనే దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. అలాంటి అవాస్తవిక ప్రచారాలను స్థానికులు తిప్పికొట్టాలని మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు.

చిత్రం..‘సాంకేతికత స్వీకరణ, తెలంగాణ పరివర్తన’ అంశంపై ఫిక్కీ నిర్వహించిన సదస్సులో ప్రతినిధులతో మంత్రి కెటిఆర్