రాష్ట్రీయం

2018లో చంద్రయాన్-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జనవరి 26: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ఈ ఏడాది మరో ఆరు రాకెట్ ప్రయోగాలు చేపడుతున్నట్లు షార్ డైరెక్టర్ కె కున్హికృష్ణన్ తెలిపారు. మంగళవారం ఆయన షార్‌లోని కల్పన అంతరిక్ష భవనంలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ 2018లో చంద్రయాన్-2 ప్రయోగానికి సన్నాహం చేస్తున్నట్లు చెప్పారు. మార్చి 10న పిఎస్‌ఎల్‌వి-సి 32 రాకెట్ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎఫ్, మార్చి 31న పిఎస్‌ఎల్‌వి-సి 33 వాహక నౌక ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జి భారత క్షేత్రియ దిక్సూచి ఉపగ్రహ ప్రయోగాలు ఉంటాయన్నారు. ఫిబ్రవరి రెండో వారంలో ఉపగ్రహాలను బెంగళూరు నుండి షార్ కేంద్రానికి తీసుకొచ్చి రాకెట్‌లో అమర్చుతామన్నారు. ఇప్పటికే నావిగేషన్ సిరీస్‌లో ఐదు ప్రయోగాలు పూర్తయ్యాయని ఈ రెండు ప్రయోగాలు పూర్తయితే నావిగేషన్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయన్నారు. సెప్టెంబరులో పిఎస్‌ఎల్‌వి-సి 34 ద్వారా మన దేశానికి చెందిన కార్డోశాట్- 2సి, అక్టోబర్ చివరిలో పిఎస్‌ఎల్‌వి-సి 35 రాకెట్ ద్వారా స్వదేశానికి చెందిన రీసోర్స్‌శాట్- 2ఎ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నట్లు పేర్కొన్నారు. జూన్‌లో జిఎస్‌ఎల్‌వి- ఎఫ్ 05 ద్వారా ఇన్‌శాట్-3డిఆర్ ఉపగ్రహ ప్రయోగం ఉంటుందన్నారు. డిసెంబరులో జిఎస్‌ఎల్‌వి-మార్క్ 3 ప్రయోగం చేపట్టనున్నట్లు తెలిపారు. ఆగస్టు నుండి డిసెంబరు చివరిలోపు ఒక ఆర్‌ఎల్‌వి పునఃప్రవేశ ప్రయోగం ఉంటుందని దీని ద్వారా అంతరిక్షంలో కాలపరిమితి అయిన ఉపగ్రహాలతో పాటు వ్యర్థపదార్థాలను తీసుకొచ్చేందుకు వీలుంటుందన్నారు. 2018లో చంద్రయాన్-2 ప్రయోగానికి సన్నాహం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో షార్ గ్రూపు డైరెక్టర్ విజయసారధి, పబ్లికేషన్ అండ్ పబ్లిసిటి అధికారి విశ్వనాధ్‌శర్మ, షార్ ఉద్యోగులు పాల్గొన్నారు.