రాష్ట్రీయం

నిర్మాణ సారథులు మీరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక భూమిక పోషించినట్టుగానే బంగారు తెలంగాణ సాధనలోనూ విద్యార్థులు భాగస్వామ్యం కావాలని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. మున్ముందు పార్టీలో, ప్రభుత్వంలోనూ విద్యార్థులకు ముఖ్య ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం తెరాస విద్యార్థి విభాగం (టిఆర్‌ఎస్‌వి) సమన్వయ సమావేశాన్ని ఉద్దేశించి కెసిఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై విద్యార్థులకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలంటే ముందుగా వాటిపై విద్యార్థులకు అవగాహన అవసరమన్నారు. బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన నీటిపారుదల ప్రాజెక్టులపై విద్యార్థులు పూర్తి దృష్టి కేంద్రీకరించి, అన్ని విషయాలూ తెలుసుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ ప్రాజెక్టులను విద్యార్థి సంఘం నాయకులు స్వయంగా పరిశీలించి రావాలని కోరారు. ఇతర రాజకీయ పార్టీలకు అధికారంలోకి రావడం ఒక్కటే లక్ష్యమని, తెరాసకు మాత్రం అదొక సవాల్‌తో కూడిన కార్యమన్నారు. టిఆర్‌ఎస్‌విలో 10 లక్షల మందిని సభ్యులుగా
చేర్పించాలని లక్ష్యాన్ని విధిస్తే 11.65 లక్షల మందిని చేర్పించడం పట్ల టిఆర్‌ఎస్‌వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను పార్టీ అధినేత కెసిఆర్ అభినందించారు. కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సహాయ కార్యదర్శులుగా నియామకమైన పలువురు నేతలు హాజరయ్యారు.

చిత్రం..తెరాస విద్యార్థి సంఘం ఆత్మీయ సమ్మేళనంలో మెమెంటో అందుకుంటున్న పార్టీ అధినేత కెసిఆర్