రాష్ట్రీయం

మరో 48 గంటలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: రానున్న 48 గంటల్లో తెలంగాణ రాష్టవ్య్రాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత 24 గంటల్లో ఎల్లారెడ్డిలో 13 సె.మీ, రుద్రూరులో 8 సెం.మీ, నిజామాబాద్, నిర్మల్‌లో 7 సెం.మీ చొప్పున, వనపర్తిలో 6 సెం.మీ వర్షపాత నమోదైంది. రుతుపవనాలు తెలంగాణలో చురుగ్గా కొనసాగుతున్నాయని వాతావరణ శాఖ మంగళవారం ప్రకటనలో పేర్కొంది. ఇదిలావుంటే, గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర రాజధాని అస్తవ్యస్తమైంది. అనేక పల్లపు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో, ఆయా ప్రాంతాలవాసులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వర్షపు నీటితోపాటు చెరువుల కట్టలుతెగి పల్లపు ప్రాంతాల్లోకి చేరుతున్న నీళ్లు, శివారు ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరుతుండటంతో దిక్కుతోచని పరిస్థితి కనిపిస్తోంది. గత నాలుగు రోజుల వర్షాలతో ప్రధాన రోడ్లు ఛిద్రమైన పరిస్థితిలో, మరో రెండు రోజులు భారీ వర్షాల ప్రకటన ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. భారీ వర్షాలతో అప్రమత్తమైన ప్రభుత్వం ఎక్కడికక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తోంది. పల్లపు ప్రాంతాలకు చేరిన నీటిని తొలగించేందుకు ప్రభుత్వ బృందాలు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయ.

చిత్రం..రాజధాని హైదరాబాద్ శివారు లోతట్టు ప్రాంతాల్లో ఇదీ పరిస్థితి