రాష్ట్రీయం

న్యాయ విచారణ జరిపించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కుమారుడు జె.షాతో పాటు ఆయన కుటుంబీకులు చేసిన కోట్లాది రూపాయల అక్రమాలపై న్యాయ విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. అమిత్ షా కుమారుని అక్రమాలపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో మాజీ మంత్రి దానం నాగేందర్ అధ్వర్యంలో మంగళవారం ట్యాంక్ బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి కార్యకర్తలను ఉద్ధేశించి ప్రసంగిస్తూ బిజెపి అధికారంలోకి రాకముందు నష్టాలలో ఉన్న జె.షా నడుపుతున్న టెంపుల్ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత లాభాలు ఆర్జించాయని ఇది ఎలా సాధ్యమైందని ఆయన ప్రధానిని ఉద్ధేశించి ప్రశ్నించారు. 2004లో జె.అమిత్బాయిషా, జితేంద్రషా సతీమణి సోనల్‌షాలు డైర్టెర్లుగా ఉన్న టెంపుల్ కంపెనీని స్థాపించారని, 2013 వరకు పెద్దగా ఆదాయం లేకుండా 50 వేల ఆదాయంతో ఉన్న కంపెనీ ఒకే ఏడాదిలో 80 కోట్ల రూపాయలకు ఎలా అభివృద్ధి చెందిందో ప్రధాని మోదీ, అమిత్ షా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు పక్కా ఆధారాలతో సహా అవినీతి బయటపడ్డా ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడడం లేదని వారు ప్రశ్నించారు.

చిత్రం..మంగళవారం ట్యాంక్‌బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న
కాంగ్రెస్ నాయకులు.