రాష్ట్రీయం

భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: భావప్రకటన స్వేచ్ఛ హక్కును అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని, కంచ ఐలయ్య రాసిన పుస్తకం తన భావాన్ని మాత్రమే వ్యక్తపరిచారని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రచయిత కంచ ఐలయ్యను బెదిరించడాన్ని తాము ఖండిస్తున్నామని, ఐలయ్యకు సామాజిక వర్గమంతా అండగా నిలువాలని జగన్ పిలుపునిచ్చారు. సామాజిక స్మగ్లర్లు-కోమటోళ్లు అనే పుస్తకంలో ఐలయ్య రాసిన విషయాలపై అభ్యంతరం ఉంటే చర్చించాలి కానీ.. వివాదం చేయడం సరికాదని జగన్ పేర్కొన్నారు. ప్రొఫెసర్ ఐలయ్య భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. ఇదే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. సంఘ్‌పరివార్ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం నడుస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం హిందూ ఫాసిస్ట్ విధానాలను అవలంభిస్తోందని జగన్ విరుచుకుపడ్డారు. ప్రముఖ పాత్రికేయురాలు గౌరీలంకేష్ హత్య, కంచ ఐలయ్యపై దాడులు సంఘ్‌పరివార్ హత్యా రాజకీయాల్లో భాగమేనన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసిఆర్ తమ వర్గాన్ని ప్రశ్నించడాన్ని సహించలేకపోతున్నారని ఆయన నిశితంగా విమర్శించారు. ఏపి సీఎం ఏకంగా ఐలయ్య పుస్తకానే్న లేకుండ చేస్తాననడం శోచనీయమన్నారు.
ఐలయ్యపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం
ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై కేసు నమోదు చేయాలని మల్కాజ్‌గిరి పోలీసులకు స్థానిక కోర్టు ఆదేశించింది. సామాజిక స్మగ్లర్లు-కోమటోళ్లు అనే టైటిల్‌తో ఐలయ్య పుస్తకం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పుస్తకంలో ఆర్యవైశ్యులను ఉద్దేశించి ఐలయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఐలయ్యపై చర్యలు తీసుకోవాలంటూ కొందరు మల్కాజ్‌గిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం ఐలయ్యపై ఐపిసి 153ఏ, 153బి, 295ఏ, 509 కిద అట్రాసిటీ కేసు నమోదు చేయాలని స్థానిక కోర్టు పోలీసులను ఆదేశించింది.