రాష్ట్రీయం

అంతరిక్ష రంగంలో అగ్రదేశాల సరసన భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: అంతరిక్ష రంగంలో భారత్ అగ్రదేశాల సరసన చేరే రోజు ఎంతో దూరంలో లేదని, అలాగే రక్షణ రంగంలో అనూహ్యమైన ప్రగతిని భారత్ సాధించిందని రక్షణ శాఖ సలహాదారు , డిఆర్‌డిఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జి సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. ఇక్ఫాయి నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ సతీష్‌రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ సముద్రగర్భం నుండి క్షిపణులను ప్రయోగించే సామర్ధ్యం ప్రపంచంలో కేవలం ఐదు దేశాలకు మాత్రమే ఉందని, అందులో భారత్ కూడా ఒకటని అన్నారు. ఒకపుడు అంతరిక్ష పరిశోధనకు, రక్షణ రంగానికి సంబంధించి అన్ని పనిముట్లకు విదేశాలపై ఆధారపడిన భారత్ నేడు విదేశాలకు వాణిజ్య కేంద్రంగా మారిందని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా డాటా అనేది కీలక అంశంగా మారిందని, డాటా విశే్లషణతోనే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి ముడిపడి ఉందని చెప్పారు. రోబోటిక్స్, కృత్రిమ మేథస్సు, విభాజ్యకణాల పరిశోధన, నానోటెక్నాలజీ, విరుద్ధ పదార్ధాల పరిశోధనలు మానవ జీవితంలో పెను మార్పులు తీసుకొస్తాయని పేర్కొన్నారు. వాతావరణం, జలాల లభ్యత, నైట్రోజన్ శాతం, వాయు ప్రమాణత, పంట పీడలపై స్పష్టమైన ఖచ్చితమైన సమాచారం తెలుసుకుని పంటలు పండించడం ద్వారా వ్యవసాయం లాభసాటిగా మారనుందని అన్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో సెన్సార్లు ఏర్పాటు చేస్తే మేఘాల సమాచారం ఒక కేంద్రానికి చేరుకుని, అక్కడి నుండి వాతావరణ మార్పుల ఆధారంగా రైతాంగానికి మార్గదర్శకం చేసే రోజులు ఎంతో దూరంలో లేదని, తద్వారా రైతులు ఏ సమయంలో ఏం చేయాలో తెలుసుకుంటారని అన్నారు. అదే విధంగా రక్షణ రంగంలో మన సత్తాను ఇప్పటికే చాటుతున్నామని పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధన, క్షిపణి ప్రయోగాల్లో ముందున్నామని అన్నారు. భౌగోళిక సమస్థితి ప్రయోగ వాహనాలు(జిఎస్‌ఎల్‌వి), అగ్ని క్షిపణులు, అంతర్వర్తిని క్షిపణి , అరిహంత్, యుద్ధ విమానాలు, చంద్రయాన్ ప్రయోగం వంటివి భారత్‌ను అగ్రపీఠాన నిలుపుతున్నాయని పేర్కొన్నారు. ఖండాంతర క్షిపణి ప్రయోగ సామర్ధ్యం కూడా భారత్‌కు ఉందని, భారత్ నుండి ఏ ఖండంపైకి అయినా క్షిపణులు మనం పంపించగలమని అన్నారు.
అదే విధంగా సముద్రగర్భం నుండి కూడా క్షిపణులను ప్రయోగించే సత్తా మనకు ఉందని చెప్పారు. అణుక్షిపణులతో కూడిన జలంతర్గామి ఉన్న దేశాల సరసన మనం చేరామని, సొంతంగా యుద్ధ విమానాలను తయారుచేసుకోగలుగుతున్నామని, ఎలక్ట్రానిక్ యుద్ధతంత్రంతో పాటు బహుళ ప్రయోజన రాడార్ వ్యవస్థ కూడా మనకు ఉందని చెప్పారు. సొంతగా మనం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు రూపొందించుకుంటున్నామని, అలాగే సముద్రగర్భంలో శ్వాస సంబంధ ఉపకరణాలు, డెంగ్యూ , చికెన్‌గున్యా నివారణ ఔషధాలు, క్రిమికీటకాల నివారణ ఉపకరణాలు, ఆహారంలో విషతుల్య పదార్ధాలుంటే వాటిని కనిపెట్టే కిట్‌లు కూడా తయారుచేసుకుంటున్నామని అన్నారు. ప్రధాని పిలుపు మేరకు మేకిన్ ఇండియా మంచి ఫలితాలు ఇచ్చిందని అన్నారు.