రాష్ట్రీయం

సగం నిండిన సాగర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: శ్రీశైలం నిండుకుండలా తయారైంది. తుంగభద్ర బేసిన్‌లో, ఎగువ కృష్ణాబేసిన్‌లో ఉధృతంగా కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు ఉప్పొంగి తరలివస్తోంది. దీంతో శ్రీశైలంలో 215 టిఎంసికి 210 టిఎంసి నీరు చేరింది. నిన్న మొన్నటి వరకు ఎడారిని తలపించిన నాగార్జునసాగర్‌కు జీవం వచ్చింది. ఈ ప్రాజెక్టు మొత్తం నీటి నిల్వ 312 టిఎంసికి ప్రస్తుతం 155 టిఎంసి ఉంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు ప్రాణధారగా ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో అనూహ్యంగా సెప్టెంబర్ నెల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో జల కళ ఉట్టిపడుతోంది. తుంగభద్ర ప్రాజెక్టులో 100.86 టిఎంసికి 81.66 టిఎంసి నీరు చేరింది. జూరాల ప్రాజెక్టులో 9.66 టిఎంసికి 9.15 టిఎంసి నీరు చేరింది. తుంగభద్ర బేసిన్‌లో రాయలసీమలో నదులు పొంగి ప్రవహిస్తుండడంతో శ్రీశైలంకు వరద తాకిడి పెరిగింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు ఒక లక్ష క్యూసెక్కుల నీరుచేరుతోంది. రెండుప్రాజెక్టుల్లో 517 టిఎంసికి 363 టిఎంసి నీరు చేరింది.
ఆగని కీచులాటలు
మా వాటా మాకు కావాలంటూ ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాలు కృష్ణాబోర్డుపై వత్తిడి పెంచుతున్నాయి. కృష్ణాబోర్డు ఈ ఏడాదికి నీటి ప్రణాళికను ఖరారు చేయాల్సి ఉంది. తెలంగాణ తమ పరిధిలో శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 28 టిఎంసి నీటిని దిగువకు విడుదల చేసిందని, కృష్ణాబోర్డు కేంద్ర జలవనరుల శాఖకు లేఖ రాసింది. వాస్తవానికి ఎనిమిది టిఎంసి నీటినే వాడుకోవాలని తాము ఆదేశించగా ఖాతరు చేయలేదని బోర్డు పేర్కొంది. కాగా ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. పోతిరెడ్డిపాడు ద్వారా 5 టిఎంసి ని కేటాయిస్తే, ఇంతవరకు 15 టిఎంసి నీటిని మళ్లించారని తెలంగాణ అభియోగం మోపింది. సెప్టెంబర్ 27, అక్టోబర్ 3వ తేదీన పోతిరెడ్డిపాడు నుంచి నీటిని మళ్లించవద్దని బోర్డు ఇచ్చిన ఆదేశాలను ఆంధ్రప్రభుత్వం పట్టించుకోలేదని తెలంగాణ పేర్కొంది. కాగా తమకు రాజ్యాంగ బద్ధమైన అధికారాలు లేవని, దీని వల్ల ఆదేశాలు అమలయ్యే విధంగా చూడలేకపోతున్నామని కృష్ణాబోర్డు చైర్మన్ శ్రీవాస్తవ గతంలోనే ప్రకటించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా ఉన్నతాధికారులు సామరస్యంగా తేల్చుకోవాలని ఆయన సూచించిన విషయం విదితమే. పరస్పరం అవగాహన రెండు రాష్ట్రాల మధ్య ఉండాలని, ఈ పరిస్ధితుల్లో నీటి ఇండెంట్లను అమలు చేయలేమని కృష్ణాబోర్డు కార్యదర్శి డాక్టర్ సమీర్ చటర్జీ ప్రకటించారు. రెండు రాష్ట్రాలు ఇండెంట్లను పంపించారని, ఒకరి ఇండెంట్, మరొక రాష్ట్రానికి ఇప్పటికే పంపించామన్నారు. రెండు రాష్ట్రాల మధ్య పరస్పర అవగాహన, ఏకాభిప్రాయం కోసం ఎదురుచూస్తున్నామన్నారు. ఈ పరిస్ధితుల్లో నీటిని విడుదల చేయలేమన్నారు.తెలంగాణ రాష్ట్రం నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు పది టిఎంసి, ఎంజికెఎల్‌ఐఎస్ స్కీంకు ఐదు టిఎంసి, ఆంధ్రప్రదేశ్ 9 టిఎంసి పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్‌కు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌కు ఐదు టిఎంసి కావాలని ఇండెంట్ పెట్టినట్లు కృష్ణాబోర్డు పేర్కొంది. కాగా తెలంగాణ 122 టిఎంసి వరకు ఈ ఏడాది తమ నీరు కావాలని పెట్టిన తాజా ఇండెంట్‌పై కృష్ణాబోర్డు ఇంకా స్పందింలేదు.