రాష్ట్రీయం

ప్రగతి ఘనం భవిత ఉజ్వలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 26: కేవలం 19నెలల కాలంలోనే ఆంధ్ర ప్రదేశ్ అన్ని రంగాల్లోనూ అద్భుతమైన, ప్రశంసనీయమైన ప్రగతిని సాధించిందని గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. అనతి కాలంలోనే వ్యాపార, వాణిజ్య పరంగా అంతర్జాతీయ దృష్టినీ ఆకర్షించిందన్నారు. పెట్టుబడులకు విస్తృమైన ప్రోత్సాహాలను ప్రకటించడం ద్వారా చాలా బలంగా వ్యాపారానుకూల వాతావరణాన్ని పాదుగొల్పిందని మంగళవారం ఇక్కడి ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన 67వ గణతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో గవర్నర్ స్పష్టం చేశారు. సానుకూల వ్యాపార వాతావరణంలో దేశంలోనే రెండో రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ముందుకొచ్చిందన్నారు.విజయవాడ-విశాఖపట్టణం మెట్రోరైలు ప్రాజెక్టు సమగ్ర నివేదికలు సిద్ధమయ్యాయని, రూ.12,725 కోట్లతో ఇందుకోసం స్పెషల్ పర్పస్ వెహికల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి అనుమతులు రాగానే మెట్రోరైలు ప్రాజెక్టు పనులు మొదలవుతాయన్నారు. దీని వల్ల అనేక రకాలుగా ప్రయోజనాలుంటాయని, ఆర్ధిక కార్యకలాపాలకూ ఊతం లభిస్తుందని తెలిపారు. గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించిన ప్రభుత్వం కృష్ణా పుష్కరాలనూ అంతే భారీగా చేపట్టేందుకు సిద్ధమవుతోందన్నారు. సుస్థిర ఆర్ధికాభివృద్ధి తమ లక్ష్యమైనప్పటికీ నిరుపేదల సంక్షేమాన్ని విస్మరించలేదన్నారు. దీనివలనే అన్ని రంగాల్లో రెండంకెల వృద్ధి సాధ్యమైందన్నారు. సంక్షేమ పథకాల ఫలాలన్నీ లక్ష్యిత వర్గాలకు చేరుతున్నాయన్నారు. అంచనాలను అధిగమించి రూ.4.70 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకట్టుకోవటం ద్వారా సిఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో తమ ప్రభుత్వం విజయవంతమైందన్నారు. 2022 నాటికి దేశంలో మూడో అగ్రగామి రాష్ట్రంగా, 2029 నాటికి దేశంలో అత్యున్నత రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలబెట్టటమే తమ ముందున్న లక్ష్యమన్నారు.
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను రికార్డు స్థాయిలో కేవలం ఐదు నెలల్లోనే కృష్ణానదికి తరలించగలిగామన్నారు. రైతు సమాజాన్ని సుసంపన్నం చేసేందుకే ఆంధ్ర ప్రదేశ్‌ను కరువు రహిత రాష్ట్రంగా రూపొందించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలుగోడు, తోటపల్లి, వంశధార, గుండ్లకమ్మ ప్రాజెక్టులను కూడా నిర్ణీత కాల వ్యవధిలో పూర్తిచేయటానికి కృషి చేస్తోందన్నారు. వర్షపు నీటిని నిల్వ చేసేందుకు వినూత్న పథకం ‘పంట సంజీవని’ ద్వారా 10 లక్షల ఫామ్ పాండ్స్, 72,299 జల సంరక్షణ నిర్మాణాలను నీరు-ప్రగతి కార్యక్రమం కింద చేపట్టడం జరిగిందన్నారు. రైతులకు 7గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నామని, భూసార పరీక్షల నిమిత్తం నమూనాలు సేకరించి వాటిని విశే్లషించి నాలుగు లక్షల మందికి శాయిల్ హెల్త్‌కార్డులను పంపిణీ చేసామన్నారు. సబ్సిడీపై 9.75 లక్షల క్వింటాళ్ల విత్తనాలను, 27.30 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను అందజేసామన్నారు. రూ.41,302 కోట్ల పంట రుణాలు, రూ.10,933 కోట్ల టర్మ్ రుణాలు రైతులకు అందించామన్నారు. వ్యవసాయాన్ని లాభసాటి చేసేందుకు రైతు సాధికార సంస్థను ప్రారంభించామన్నారు.
రాష్ట్రంలో అందరికీ హెల్త్ కేర్ సర్వీసులు అందుబాటులోకి తేవడానికి కృతనిశ్చయంతో ఉన్నామని, అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో కొత్తగా ఎన్టీఆర్ వైద్య పరీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. నిరుపేదలకు టెలీ, రేడియాలజీ సర్వీసులతో పాటుగా 60 పాథాలజీ పరీక్షలను ఉచితంగా చేస్తున్నామన్నారు. గర్భిణీలు, నవజాత శిశువుల సంరక్షణ కోసం ‘102 సర్వీసెస్’ పేరిట వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో కాన్పు తరువాత బాలింత, నవజాతి శిశువును ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ ద్వారా ఉచితంగా వారి కుటుంబ సభ్యులతో సహా స్వగృహానికి చేర్చటం జరుగుతుందన్నారు. ప్రతిష్టాత్మక వైద్య సంస్థ ‘ఎయిమ్స్’ ఏర్పాటుకు అమరావతిలో పునాదిరాయి పడిందన్నారు. పేదలు, సామాన్య ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రథమ ప్రాథాన్యత ఇస్తుందంటూ ఎన్టీఆర్ భరోసా, వికలాంగ, వృద్ధులు, వితంతువులు, గీత కార్మికులు, చేనేత కార్మికుల పెన్షన్ల గురించి ప్రస్తావించారు. పేద కుటుంబాలకు పౌష్టికాహారం అందించటంలో భాగంగా లబ్దిదారులకు ప్రతినెలా ఒక్కొక్కరికి 4 నుంచి 5 కిలోలకు పెంచి ఇటీవలే 12.42 లక్షల కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయటం జరిగిందన్నారు. ఇటీవలే కాపులు, బ్రాహ్మణుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ఎస్‌సి సబ్‌ప్లాన్ కింద 2015-2016 సంవత్సరానికి రూ.5877.96 కోట్ల బడ్జెట్‌ను కేటాయించటం జరిగిందన్నారు. దళిత, గిరిజన వాడల్లో అంతర్గత సిమెంట్ రహదారుల అభివృద్ధికి ‘వాడవాడలో చంద్రన్న బాట’ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించటం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దటంలో కేంద్రీయ విద్యా, పరిశోధనా సంస్థలు దోహదపడతాయన్నారు. దేశంలోనే తొలిసారిగా కేబుల్ టివి, ఇంటర్నెట్ కనెక్షన్లను, ఓవర్‌హెడ్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్ ద్వారా అందించే విధానాన్ని చేపట్టామని, విద్యుత్ పొదుపు,నిర్వహణలో దేశం మొత్తంలోనే ముందున్నామన్నారు. రోజుకు 22 మిలియన్ యూనిట్ల కొరతతో ప్రారంభమైన కొత్త రాష్ట్రంలో స్వల్పకాలంలోనే జీరో పవర్ కట్స్ మైలురాయిని అధిగమించిందన్నారు. గత విజయదశమి రోజున రాజధాని అమరావతి నగర నిర్మాణానికి అంకురార్పణ జరిగిందని, 21వ శతాబ్దానికి అద్భుత నగరంగా నిలువగలదన్న నిలిచిపోతుందన్న విశ్వాసాన్ని గవర్నర్ వ్యక్తం చేశారు. గత 19నెలల్లో చేపట్టిన అభివృద్ధి నమూనాలను ఇతర రంగాలకూ విస్తరించి ప్రజలకు మరింతగా ప్రయోజనం కలిగించాల్సి ఉందన్నారు.

చిత్రం... ముఖ్యమంత్రి చంద్రబాబు భుజంపై చేయవేసి
జెండా ఆవిష్కరణకు వస్తున్న గవర్నర్ నరసింహన్