రాష్ట్రీయం

విద్యారంగంలో మార్పు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: విద్యారంగంలో పెనుమార్పులు రావల్సిన అవసరం ఆసన్నమైందని ప్రదాన మంత్రి మాజీ ఆర్ధిక సలహాదారు, మాజీ గవర్నర్ డాక్టర్ సి రంగరాజన్ పేర్కొన్నారు. ఇక్ఫాయి సంస్థ నిర్వహించిన ఏడో స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ సిలబస్‌లోనూ, కరిక్యులమ్‌లోనూ మార్పులు రావాలని, ప్రామాణిక విద్యను అందించేందుకు సమర్ధత ఉన్న అధ్యాపకులు కావాలని, విద్యార్ధుల వైఖరిలోనూ మార్పు రావాలని, పరీక్షల సంస్కరణలు కూడా రావాలని అన్నారు. మంచి పాఠ్యప్రణాళిక లేకున్నా, మంచి టీచర్‌లేకున్నా, మంచి విద్యార్ధి లేకున్నా, మంచి నికష లేకున్నా విద్యా కార్యాచరణ మొత్తం వృధా అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నేటి పరీక్షలు కేవలం జ్ఞాపక శక్తిని మాత్రమే పరీక్షిస్తున్నాయని, విద్యార్ధి విచలనాలను పరీక్షించేవిగా లేవని పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సాంకేతిక రంగాల అభివృద్ధి, ఆయా రంగాల్లో వృత్తి నిపుణుల నైపుణ్యతపైనే ఆధారపడి ఉంటుందని, అటువంటి నైపుణ్యత, సరైన ఉన్నత విద్య ద్వారానే సాధ్యపడుతుందని అన్నారు. విద్యార్ధులకు తమ ఉన్నత చర్యలతో దేశ గతిని మార్చే శక్తి ఉందని, ఆ శక్తిని వినియోగించి దేశ పురోభివృద్ధికి పోటీపడి తాను కూడా ఎదగాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఛాన్సలర్ హోదాలో 1466 మంది విద్యార్థినీ, విద్యార్థులకు పట్టాలను బహుకరించారు. అత్యంత ప్రతిభ కనబరిచిన ఏడుగురికి స్వర్ణ పతకాలు, ఐదుగురికి రజత పతకాలు అందించారు. భవిష్యత్‌లో ఈ పోటీ ప్రపంచంలో తాము చేపట్టబోయే ఉపాధి రంగంలో, ఉద్యోగంలో రాణించాలంటే ధృడసంకల్పంతో అత్యంత మనోనిబ్బరంతో విధులను నిర్వహించాలని ఆయన ఆకాక్షించారు. ఈ సందర్భంగా యూనివర్శిటీ ముగ్గురు ప్రముఖులు ప్రొఫెసర్ శాంతాసిన్హా, సోనమ్ వాంగ్‌చుక్, సుదర్శన్ పట్నాయక్‌లకు గౌరవ డాక్టరేట్‌లను అందించింది. ఈ సందర్భంగా ఉపకులపతి డాక్టర్ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ గత ఏడేళ్లుగా జరిగిన పురోగతిని వివరిస్తూ త్వరలోనే యూనివర్శిటీని డిజిటల్ యూనివర్శిటీగా మార్చనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు, ప్రిన్సిపాల్స్, డీన్‌లు, ప్రొఫెసర్లుతో పాటు బ్రాండింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ సుధాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..మంగళవారం ఇక్ఫాయ యూనివర్శిటీలో నిర్వహించిన స్నాతకోత్సవంలో పాల్గొన్న మాజీ గవర్నర్ రంగరాజన్