రాష్ట్రీయం

మల్కాపూర్ దేశానికే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తూప్రాన్, అక్టోబర్ 11: మారుమూల ప్రాంతం లో ఉన్న మల్కాపూర్ గ్రామం దేశానికి ఆదర్శం గా నిలుస్తోందని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ అసిస్టెంట్ ప్రొఫెసర్ వాలెంటీన పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా మల్కాపూర్ గ్రామాన్ని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వివిధ శాఖలకు చెందిన 19 మంది ప్రతినిధుల బృందం సందర్శించింది. గ్రామాల అభివృద్ధిలో ప్రజల పాత్రపై అధ్యయనానికి తాము ఈ గ్రామాన్ని సందర్శించామని విదేశీ ప్రతినిధులు ఈ సందర్భంగా చెప్పారు. మల్కాపూర్ యువత గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దారని ప్రశంసించా రు. కలిసికట్టుగా గ్రామాన్ని ఆదర్శం గా నిలపారన్నారు. హరితహారంలో భాగంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటడం, పరిసరాల పరిశుభ్రం, సేంద్రీయ కూరగాయల పెంప కం మొదలైన కార్యక్రమాలు చాలా బాగున్నాయన్నారు. గ్రామంలో ప్రతి వీధిలో కలిసి తిరిగారు. ఈ బృం దంలో జింబాబ్వే, ఇతియోపియా, మాల, నగ్రీ, ఆఫ్గనిస్తాన్, గున్య, శ్రీలంక, ఫిలిప్పీన్స్, టాంజానియా, ఇండియా, మాలావి, నమీబియా మొదలగు దేశాలకు చెందిన ప్రతినిదులు పాల్గొన్నారు.