రాష్ట్రీయం

పోలవరం’పై విచారణ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబరు 11: పోలవరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటి)లో దాఖలైన పిటిషన్ విచారణ డిసెంబరు 5కు వాయిదా పడింది. ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు బుధవారం విచారణకు వచ్చింది. అయితే గతంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున ఎన్జీటిలో విచారణ అవసరం లేదని ఏపీ ప్రభుత్వం గతంలో పేర్కొంది. దీనికి సంబంధించి తెలంగాణ, చత్తీస్‌గడ్, ఒడిశా రాష్ట్రాలు అఫిడవిట్లు దాఖలు చెయ్యలేదు. దీనిపై పిటిషన్ తరపు న్యాయవాది శ్రవణ్ కుమార్ స్పందిస్తూ పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులకు సంబంధించి సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు కాలేదని వివరించారు. ఎన్జీటిలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణ జరగకుడదు అన్న ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తికి తెలంగాణ, ఒడిశా, చత్తిస్‌గఢ్ రాష్ట్రాలు దాఖలు చెయ్యకపోవడంతో, కౌంటర్లు దాఖలు చెయ్యాలని ఆయా రాష్ట్రాలను ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబరు 5కు వాయిదా వేసింది.