రాష్ట్రీయం

సుప్రీంకోర్టు జడ్జితో విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమోదీ సర్కార్ అంతా అవినీతిమయం ప్రధాని నోరు విప్పాలి
ఖనోట్ల రద్దు, జిఎస్‌టితో కంపెనీల కుదేలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 11: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జయ్ షా అక్రమాలపై సుప్రీం కోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని పంజాబ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ అక్రమాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. బుధవారం గాంధీ భవన్‌కు విచ్చేసిన మంత్రి బాదల్‌ను టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీ ఎంపి వి. హనుమంత రావు, ప్రధాన కార్యదర్శులు దాసోజు శ్రవణ్‌కుమార్, నిరంజన్ తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి బాదల్ మీడియాతో మాట్లాడుతూ ఈ కుంభకోణం దేశంలోనే అతి పెద్దదని అన్నారు. ప్రధాని మోదీ మూడున్నర ఏళ్ళ పాలన అంతా అవినీతిమయం అయ్యిందని ఆయన విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి పేరిట చేసిన హడావిడి వల్ల దేశ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరకపోగా వేలాది కంపెనీలు కుప్పకూలి దేశం ఆర్థికంగా దివాళా తీసిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల బిజెపి నేతలు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే బాగుపడ్డారని, దీనికి అమిత్ షా కుమారుడు జయ్ షా కంపెనీ వ్యవహారమేనని ఆయన తెలిపారు. జయ్ షాకు చెందిన టెంపుల్ ఎంటర్‌ప్రైజెస్ 2013-14 ఆర్థిక సంవత్సరంలో నష్టాల్లో ఉందని, ఏడాది తిరిగిలోగా అది రూ.80 కోట్ల లాభానికి ఎలా చేరుకున్నదని ఆయన ప్రశ్నించారు. నష్టాల్లో ఉన్న కంపెనీకి బ్యాంకులు కోట్ల రూపాయలు రుణాలు ఎందుకు ఇచ్చాయో తేలాలని అన్నారు. ఏడాదిలో భారీ లాభాలు సాధించేలా అద్భుతం ఏమి చేశారని మంత్రి బాదల్ ప్రశ్నించారు. వాస్తవానికి ఆ సమయంలో పెద్ద నోట్ల రద్దుతో అనేక కంపెనీలు ఇబ్బందులు పడ్డాయని, జిఎస్‌టి అమలుతో ఇంకా ఇబ్బందులకు గురయ్యాయని ఆయన తెలిపారు. అటువంటి సమయంలో జయ్ షా కంపెనీ మాత్రమే లాభాలు ఎలా గడించగలిగిందన్నారు. దీనిపై అనేక సందేహాలు, అనుమానాలు ఉన్నందున న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. టెంపుల్ ఎంటర్‌ప్రైజెస్ 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాల్లో నష్టాల్లో ఉందని, 2015 తర్వాత లాభాల్లోకి వచ్చిందన్నారు. అదే కంపెనీ 2015-16లో రూ.80 వేల టర్నోవర్ చేసి అనంతరం ఎలా మూతపడిందని ఆయన ప్రశ్నించారు. జార్కండ్‌లో రాజ్యసభకు ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన వ్యక్తికి బిజెపి ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారని, దీనికి ప్రతిఫలంగా ఆ రాష్ట్రం ఒక బ్యాంకు నుంచి టెంపుల్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.15 కోట్లు రుణం ఇచ్చిందని, ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని ఆయన తెలిపారు. ప్రభుత్వ రంగ అనుబంధ సంస్థ కో-ఆపరేటివ్ బ్యాంకు నుంచి రూ.25 కోట్ల రుణం ఇచ్చారని, ఇండియన్ రెన్యువెబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ సంస్థ నుంచి మరో రూ.10 కోట్ల రాయితీ ఇచ్చారని చెప్పారు. ఒక ప్రైవేటు సంస్థకు అటార్నీ జనరల్ వత్తాసు పలకడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తాము ఎలాంటి కేసులకు బెదరమని మంత్రి బాదల్ అన్నారు.