రాష్ట్రీయం

క్యూలైన్‌లో విద్యుత్ షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 11: శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద ఉన్న క్యూలైన్‌లలో గ్రిల్స్‌కు విద్యుత్ సరఫరా అయి షాక్ కొడుతోందని భక్తులు ఆందోళన చెందిన సంఘటన బుధవారం జరిగింది. ఈక్రమంలో భక్తులు ఒత్తిడికి గురికావడంతో కొంత తోపులాట తలెత్తింది. తోపులాటలో తమిళనాడుకు చెందిన చిన్నారి చేతికి గాయమైంది. వెంటనే చిన్నారిని స్థానిక అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. మహాద్వారం స్కానింగ్ సెంటర్ వద్ద విద్యుత్ సరఫరా అవుతోందని భక్తులు మధ్యాహ్నం 1.30కు అక్కడున్న భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. తితిదే విద్యుత్‌శాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అయితే గ్రిల్స్‌కు విద్యుత్ సరఫరా జరగలేదని, షార్ట్ సర్క్యూట్‌లాంటి ప్రమాదం ఏమీ లేదని స్పష్టం చేశారు. అటు తరువాత ఇదే విషయాన్ని టిటిడి సిబ్బంది భక్తులకు తెలియజేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. యథావిధిగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టిటిడి పిఆర్వో ప్రకటనలో తెలిపారు. అంతకుమునుపు గ్రిల్స్‌కు విద్యుత్ సరఫరా అవుతుందని భావించిన భక్తులు ప్రాణభయంతో ఒత్తిడికి లోనుకావడంతో తోపులాటలు జరిగాయి.