రాష్ట్రీయం

ఫాతిమా కేసులో ఎదురు దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: కడప జిల్లా ఫాతిమా మెడికల్ కాలేజీ 2015-16 విద్యార్థులకు వివిధ కాలేజీల్లో అదనపు సీట్లు కల్పించి ప్రస్తుత వైద్య విద్యా సంవత్సరం కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను భారత వైద్య మండలి (ఎంసిఐ) తిరస్కరించింది. దీంతో మరో ప్రతిపాదనతో వస్తామని, మరింత సమ యం కావాలని సుప్రీం కోర్టును ఏపీ కోరడంతో, కేసును రెండువారాలు వాయిదా వేశారు. ఫాతిమా కాలేజీ సీట్ల సర్దుబాటుకు సంబంధించిన పిటిషన్‌ను జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారించింది.
ఎంసిఐ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సీట్ల సర్దుబాటుపై ఏపీ ప్రతిపాదనను తిరస్కరించిన వివరాలతో అఫిడవిట్‌ను ధర్మాసనానికి సమర్పించారు. వివిధ కాలేజీల్లో ఫాతిమా విద్యార్థులను సర్దుబాటు చేస్తామంటూ ఏపీ సర్కారు గతంలో సమర్పించిన అఫిడవిట్‌ను ఎంసిఐ కమిటీ పరిశీలించిందని న్యాయవాది కోర్టు కు వివరించారు. అలాగే ఫాతిమా కాలేజీకి చెందిన 2015-16 విద్యార్థులకు సంబంధించి ఉమ్మడి హైకోర్టు, సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలనూ కమిటీ పరిశీలించింది. ఆంధ్ర ప్రభుత్వం దాఖలు చేసిన ప్రతిపాదనను అనుమతించలేమని, ఎంసిఐ కౌన్సిల్ నియంత్రణ నిబంధనలను సడలించలేమని కమిటీ నిర్ణయించినట్టు ధర్మాసనానికి తెలిపారు. ఆంధ్ర సర్కారు ప్రతిపాదనను అనుమతిస్తే, వచ్చే విద్యా సంవత్సరం ప్రభుత్వ వైద్య కాలేజీల్లో సీట్లు తగ్గించడమే అవుతుందని, ప్రభుత్వ కాలేజీల్లో ప్రతిభ ఆధారంగా భర్తీ కావల్సిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని కమిటీ అభిప్రాయ పడిందని ధర్మాసనానికి ఎంసిఐ తరపు న్యాయవాది వివరించారు. ఆంధ్ర ప్రభుత్వం ప్రతిపాదనను తోసిపుచ్చాలని ధర్మాసనాన్ని ఎంసిఐ తరపు న్యాయవాది కోరారు. అనంతరం ఆంధ్ర తరపు న్యాయవాది గౌరవ్ బెనర్జీ వాదనలు కొనసాగిస్తూ తమకు మరో ప్రతిపాదన దాఖలు చేసేందుకు రెండువారాలు సమయం కావాలని ధర్మాసనాన్ని విజ్ఞప్తి చేశారు. దీంతో ధర్మాసనం కేసును రెండువారాలకు వాయిదా వేసింది. దీనికి సంబంధించి కేంద్రం ఇంకా అఫిడవిట్ దాఖలు చేయాల్సివుంది.