రాష్ట్రీయం

నిండిన శ్రీశైలం జలాశయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, అక్టోబర్ 11: శ్రీశైల జలాశయం పూర్తిగా నిండింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద రావడంతో బుధవారం రాత్రికి 884.50 అడుగులకు చేరుకుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 211.95 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి 1,47,340 క్యూసెక్కుల నీరు జలాశయానికి వచ్చి చేరుతోంది. జూరాల నుంచి 1,11,884 క్యూసెక్కలు, రోజా నుం చి 31,353 క్యూసెక్కులు, హంద్రీనీవా నుంచి 4,170 క్యూసెక్కుల నీరు శ్రీశైల జలాశయానికి వచ్చి చేరుతోంది. మొదటి పవర్ హౌస్‌లో విద్యుత్ ఉత్పత్తి అనంతరం 32,236 క్యూసెక్కులు, రెండవ పవర్‌హౌస్‌లో విద్యుత్ ఉత్పత్తి అనంతరం 42,378 క్యూసెక్కులు కలిపి 74,614 క్యూసెక్కుల నీరు దిగువ సాగర్‌కు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిగా నిండడంతో గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. అయితే పై నుంచి వచ్చిన నీటిలో ఎక్కువ భాగం దిగువకు విడుదల చేస్తున్నందున గేట్ల ఎత్తివేతపై ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. గేట్లు ఎత్తడం ద్వారా నీటిని వృథాగా దిగువకు విడుదల చేయడం కన్నా విద్యుత్ ఉత్పత్తి, హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు, కల్వకుర్తి ఎత్తిపోతలకు మరింత ఎక్కువ మొత్తంలో నీటిని విడుదల చేయడం మేలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. అం దువల్లే గేట్ల ఎత్తివేతలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇన్‌ఫ్లో ఏమాత్రం పెరిగినా తక్షణం గేట్లు ఎత్తివేయడం ఖాయం.

నేడు శ్రీశైలం గేట్ల ఎత్తివేత

శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో ప్రాజెక్టు గేట్లను గురువారం ఎత్తాలని ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఉదయం 6.30 గంటలకు 6, 7, 8 నెంబరు గేట్లను ఎత్తి సగటున 80 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తారని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నీటి మట్టం 883 అడుగుల మేర నిర్వహించాలన్న నిర్ణయంతో గేట్లను సాయంత్రం వరకు ఎత్తి ఉంచి ఆ తరువాత నీటి చేరిక లెక్కలను పరిశీలించి మూసి వేసే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.