రాష్ట్రీయం

బిసిలకు చట్ట సభల్లో రిజర్వేషన్లకై పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 11: వెనుకబడిన వర్గాలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బిసి ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి పెంచేందుకు ఈ నెల 20న కడప జిల్లా వివి రెడ్డి నగర్‌లో రాయలసీమ ఉద్యోగుల అధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య తెలిపారు. ఆ తర్వాత 22న రాజమండ్రిలో, 25న భువనగిరిలో భారీ ఎత్తున బిసిల సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బిసి ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. బిసిలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించే వరకూ ఉద్యమాలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బిసి ఉద్యోగులకు ఎస్‌స్/ఎస్‌టి ఉద్యోగులతో సమానంగా, దామాషా (ఎ,బి,సి,డి) ప్రకారంగా పదోన్నతులు కల్పించాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.