రాష్ట్రీయం

భారత విద్యార్థులపై అట్లాంట వర్శిటీల ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 11: అమెరికా అట్లాంటలోని 50 విశ్వవిద్యాలయాలు భారతీయ విద్యార్థులపై ఆసక్తి చూపుతున్నాయి. తమ వర్శిటీల్లో ఆఫర్ చేస్తున్న కోర్సుల్లో చేరేందుకు , పరస్పర భాగస్వామ్యంగా ఎక్స్చేంజి కార్యక్రమం నిర్వహించేందుకు అట్లాంటా నుండి వచ్చిన ప్రతినిధి బృందం తెలంగాణ ఉన్నత విద్యామండలిని కోరింది. బృందం ప్రతినిధులు ఎరిక్ టైయర్, ఇలియట్ పాయి, టి జె జాక్సన్, శ్రీకాంత్ బొడిగ, సిఎస్ షేక్ సబర్వాల్ తదితరులు బుధవారం నాడు మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, వైస్ చైర్మన్‌లు ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ప్రొఫెసర్ వి వెంకటరమణలను కలిశారు. భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో తాము విద్యాశాఖ అధికారులను కలిసినట్టు వారు చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యకలాపాలను చైర్మన్ పాపిరెడ్డి వారికి వివరించారు. అట్లాంటలో 50 వరకూ యూనివర్శిటీలు ఉన్నాయని, పరస్పరం సహకరించుకోవడం ద్వారా విద్యార్థులకు మేలు జరిగే కార్యక్రమాలను నిర్వహించాలని ఉభయులు నిర్ణయించారు.

ఉచితంగా కౌశలాల శిక్షణ

జెఎన్‌టియు హెచ్ తమ విద్యార్థుల కోసం ట్యాలంట్ టెస్టుబుడ్డీని ప్రారంభించింది. జెఎన్‌టియు, అనుబంధ విద్యాసంస్థల్లో చదువుకున్న వారు మూడు నెలల పాటు ఆన్‌లైన్‌లో ఉచితంగా కౌశలాల శిక్షణ పొందే అవకాశాన్ని కల్పించింది. యుఐఐసి డైరెక్టర్ సిహెచ్ వెంకట రమణారెడ్డి, సూపర్ క్యాంపస్ డైరెక్టర్ సి గిరిధర్, ట్యాలెంట్ స్ప్రింట్ ఉపాధ్యక్షుడు ఫజుల్ హసన్‌లు ఈ విషయాన్ని వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారు , బిటెక్ ఫైనల్ ఇయర్‌లో ఉన్న వారు టెస్టు బుడ్డీ ఎట్‌ద రేట్ ఆఫ్ ట్యాలెంట్ స్ప్రింట్ డాట్ కామ్‌కు తమ వివరాలు మెయిల్ చేయాలని సూచించారు.