రాష్ట్రీయం

ఆత్మహత్యలకు స్వస్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 26: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, రైతుల ఆత్మహత్యలులేని రాష్ట్రంగా మార్చాలనేది ధ్యేయమని సిఎం చంద్రబాబు పేర్కోన్నారు. రైతులకు అండగా ఉంటానని భరోసాయిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో ‘పెట్టుబడి లేని సహజ ప్రకృతి వ్యవసాయం’పై రైతులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి మంగళవారం సిఎం హాజరయ్యారు. రైతులకు శిక్షణ ఇస్తున్న ప్రముఖ ప్రకృతి వ్యవసాయ శాస్తవ్రేత్త సుభాష్ పాలేకర్ సేవలను సిఎం కొనియాడారు. ప్రకృతి సహజ వ్యవసాయం ద్వారా పండిన పంటలు తింటే బిపి, షుగర్ వంటి వ్యాధులు మనిషి దరికి చేరవన్నారు. సహజ ప్రకృతి వ్యవసాయ విధానంలో ఉత్పత్తి చేసిన పంటలకు అవసరమైన సర్ట్ఫికేషన్ ఇచ్చి, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేస్తామన్నారు. శిక్షణ కార్యక్రమంలో 13 జిల్లాల నుండి రైతులు, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు పాల్గొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. పంట సంజీవని పథకం ద్వారా రాష్ట్రంలో సుమారు 10 లక్షల నీటి కుంటలను తవ్వనున్నట్టు చెప్పారు. రైతులకు ఏవిధమైన ఖర్చు లేకుండా వీటిని తవ్వుతామన్నారు. రాష్ట్రంలో 25 రకాల పంటలకు అధిక ప్రాధాన్యతనిచ్చి, ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగుకు ప్రోత్సహిస్తామన్నారు. శిక్షణ పొందిన ప్రతి రైతు కనీసం 10మంది రైతులను ఈ విధానంలో సాగు ప్రారంభించేలా ప్రోత్సహించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయం కింద ఉత్పత్తి అయిన పంటలను కొనేందుకు ప్రజలు ఎదురుచూసే పరిస్థితి వస్తుందన్నారు. నెలకు కనీసం 10 రోజులు రాష్ట్రంలో ఉండాల్సిందిగా శాస్తవ్రేత్త పాలేకర్‌ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలోని రైతులకు నిరంతరాయంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రకృతి వ్యవసాయాన్ని పూర్తిస్థాయిలో పాదుకొల్పేందుకు కృషి చేయాలని కోరారు.
త్వరలో శ్రీశైలం నుండి రాయలసీమకు నీరు
నదుల అనుసంధానంతో దేశంలోనే మన రాష్ట్రం ఒక రోల్ మోడల్‌గా నిలిచిందని ముఖ్యమంత్రి చెప్పారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసంధానించామని, త్వరలో రాయలసీమకు శ్రీశైలం నుండి జలాలను తరలించనున్నట్టు తెలిపారు. రానున్న మూడేళ్లలో రాష్ట్రాన్ని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. గృహ అవసరాలకు 24 గంటలు, వ్యవసాయానికి 7 గంటల పాటు నిరంతర విద్యుత్‌ను అందజేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. వ్యవసాయం ద్వారా ఈ ఏడాది రూ.53వేల కోట్లు, ఉద్యానవన రంగం ద్వారా రూ.44వేల కోట్లు, డెయిరీ ద్వారా రూ.30వేల కోట్లు, మత్స్యశాఖ ద్వారా రూ.35వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి విజయకుమార్, తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షుడు నామన రాంబాబు, కలెక్టర్ హనుమంతు అరుణ్‌కుమార్, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. ప్రకృతి వ్యవసాయ శాస్తవ్రేత్త సుభాష్ పాలేకర్‌తో మాట్లాడుతున్న సిఎం చంద్రబాబు