రాష్ట్రీయం

‘గ్రీన్ రైల్వే స్టేషన్’గా సికింద్రాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 11: దేశంలో ఉన్న రైల్వే స్టేషన్లలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ‘గ్రీన్ రైల్వే స్టేషన్’గా గుర్తింపు తెచ్చుకుంది. ఇండియా గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, కానె్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సంయుక్తంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు గ్రీన్ రేటింగ్ ఇచ్చాయి. దక్షిణ మధ్య రైల్వేకి ఇప్పటి వరకు లభించిన రికార్డుల్లో ఇదో అరుదైన రికార్డుగా రైల్వే అభివర్ణించింది. ఈ రేటింగ్ కోసం జాతీయ స్థాయిలో పరిశీలనకు తీసుకునే అంశాలైన నీటి సంరక్షణ, చెత్త, వ్యర్ధపదార్ధాలను సక్రమంగా తొలగించడం, ఇంధన సామర్ధ్యాన్ని సక్రమంగా వినియోగించుకోవడం, విద్యుత్ వినియోగంలో పొదుపు, అనవసరమైన మెటీరియల్స్‌ను వాడకుండా తద్వారా ఆరోగ్య పరిరక్షణ, ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించడంతో గ్రీన్ రైల్వే స్టేషన్‌గా గుర్తింపు వచ్చిందని రైల్వే తెలిపింది. ఈ నెల 5న జైపూర్‌లో జరిగిన గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ 2017లో సికింద్రాబాద్ డివిజన్ రైల్వే అధికారులు వరల్డ్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ చైర్మన్ తాయ్ లీ సియాంగ్, సిఈఓ టెర్రీ విల్స్ నుంచి ఈ అవార్డును స్వీకరించారు. ఈ అవార్డు కాలపరిమితి మూడేళ్ల వరకు ఉంటుంది. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ వ్యూహ రచన చేసి అందించిన ప్రణాళిక మేరకు కింది స్థాయి అధికారులంతా సమిష్టిగా చేసిన కృషి ఫలితంగా జాతీయ స్థాయి గుర్తింపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు లభించిందని రైల్వే పేర్కొంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 13.34 ఎకరాల్లో ఉండగా, ఆ పరిధిలో వివిధ రకాల 408 చెట్లను పెంచుతున్నారు. 2016లో 500 కెడబ్ల్యూపి సామర్ధ్యంతో కూడిన సౌరవిద్యుత్ పాంట్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ ద్వారా 2500 యూనిట్ల విద్యుత్ ఉత్పాతన ప్రతి రోజు జరుగుతోంది. సికింద్రాబాద్ స్టేషన్ విద్యుత్ అవసరాల్లో 37 శాతం సౌర విద్యుత్ ప్లాంట్ తీరుస్తూ ఏటా రూ.72.92 లక్షల మొత్తాన్ని ఆదా చేస్తోంది. ఇలా చేపట్టిన ఎన్నో మంచి పనుల వల్ల జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.