రాష్ట్రీయం

కృష్ణా ట్రిబ్యునల్ విచారణ నేటికి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: కృష్ణా నదీ జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణ నేటికి వాయిదా పడింది. విభజన చట్టం సెక్షన్-89 ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య కృష్ణానదీ జలాల పంపకాలపై విచారణ చేపట్టేందుకు గురువారం ట్రిబ్యునల్ సమావేశమైంది. తెలంగాణ తరపున సాక్షులుగా మాజీ సెంటర్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ జీ.ఎస్.ఝా, (ఇంజీనీరింగ్), ప్రొ. జయకుమార్ (హైడ్రాలజీ)లను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆంధ్ర తన అవసరాలకు అనుగుణంగా దాఖలు చేసిన అఫిడవిట్‌పై తెలంగాణ తరపు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన సాక్షి నీటిరంగ నిపుణుడు కేవీ సుబ్బారావుకు 30 ప్రశ్నలు సంధించారు. వాటికి సుబ్బారావు సమాధానాలిచ్చారు. ఇందులో కృష్ణానదికి సంబంధించిన వివరాలు మూఖ్యంగా నదీ పరీవాహక ప్రాంతంలో వర్షపాతం, నీటి లభ్యత, వినియోగం తదితర అంశాలకు సుబ్బారావు సమాధానాలిఇచ్చారు. పోలవరం, పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు సాగునీరు ఇవ్వచ్చు కదా అన్న ప్రశ్నకు సుబ్బారావు స్పందిస్తూ- గోదావరి జలాలను వినియోగించుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తాత్కాలికంగా చేపట్టినట్టు తెలిపారు. అనంతరం ట్రిబ్యునల్ చైర్మన్ బ్రిజేష్ కుమార్ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.