రాష్ట్రీయం

కంచ ఐలయ్యపై ప్రకాశం జిల్లాలో కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: డాక్టర్ కంచ ఐలయ్యపై కనిగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ హైకోర్టుకు తెలిపారు. హైదరాబాద్ హైకోర్టు ఎపికి, తెలంగాణకు ఉమ్మడి హైకోర్టుగా పనిచేస్తోంది. వత్సల అనే మహిళ కంచ ఐలయ్యకు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా కనిగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ‘కోమట్లు సామాజిక స్మగర్లు’ అన్న పేరుతో ఒక పుస్తకం ప్రచురించారని, ఈ పుస్తకం కోమట్ల మనస్సును గాయపరిచిందని ఆమె పేర్కొన్నారు. గతంలో కూడా కంచ ఐలయ్య బ్రాహ్మణులకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు సమాజంలో దుమారం రేపాయని, ఆయనపై బ్రాహ్మణులు వివిధ చోట్ల కేసులు పెట్టారని ఆమె గుర్తు చేశారు. కనిగిరి పోలీసులు కంచ ఐలయ్యపై మొదట కేసు నమోదు చేయకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. తాను ఇచ్చిన దరఖాస్తుపై కంచ ఐలయ్యపై ఎందుకు కేసు నమోదు చేయడం లేదో ఎపి పోలీసులను అడగాలంటూ హైకోర్టును ఆమె కోరింది. దాంతో హైకోర్టు ఎపి పోలీసు శాఖకు నోటిసు పంపించింది. దీనికి స్పందించిన ఎపి పోలీసులు, లిఖితపూర్వకంగా హైకోర్టుకు ఒక లేఖ అందిస్తూ, ఐపిసిలోని 120 (బి) సెక్షన్, 153-ఎ సెక్షన్ల కింద ఐలయ్యపై కేసు నమోదు చేశారని వివరించారు. దాంతో వత్సల దాఖలు చేసిన పిటీషన్‌పై వాదనలు ముగిశాయని, పిటీషన్‌ను ముగించివేస్తున్నామని హైకోర్టు ప్రకటించింది.