రాష్ట్రీయం

గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ నగరానికి వస్తున్న ఓ మహిళ ప్రయాణికురాలి బ్యాగులోని భారీ మొత్తంలో నగదు, నగలు చోరీకి గురయ్యాయి. సికిందరాబాద్‌లో రైలు దిగే సమయంలో గుర్తించిన బాధితురాలు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలావున్నాయి. రాజమండ్రికి చెందిన వాణి మియాపూర్‌లో నివాసముంటోంది. బంధువుల శుభకార్యం ఉండడంతో రాజమహేంద్రవరానికి వెళ్లింది. కార్యం ముగిసిన తరువాత ఆమె తిరిగి గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో సికిందరాబాద్‌కు బయలుదేరింది. గురువారం ఉదయం సికిందరాబాద్ చేరుకున్న ఆమె రైలు దిగే సమయంలో బ్యాగు చూసుకోగా అందులో ఉండాల్సిన రూ. 5 లక్షలు నగదుతోపాటు సుమారు రూ. కోటి విలువగల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్టు గుర్తించింది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.