రాష్ట్రీయం

వరుణుడి వీర విహారంతో రబీపై చిగురిస్తున్న ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: వరుణుడి వీర విహారంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు జల సిరితో కళకళలాడుతున్నాయి. నాగార్జునసాగర్ ఆయకట్టు కింద ఉన్న 20 లక్షల ఎకరాల ఆయకట్టు రైతుల ఆనందతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఖరీఫ్‌కు మంగళం పాడినా, ఆలస్యంగానైనా రబీ సీజన్‌కు శ్రీశైలం నీటిని నాగార్జునసాగర్‌కు వదిలి సగం ఆయకట్టుకైనా నీటిని విడిచే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల మొత్తం నీటినిల్వ సామర్ధ్యం 527 టిఎంసి కాగా, ప్రస్తుతం 378 టిఎంసికి చేరుకుంది. ప్రస్తుతం ఇదే వర్షాలు మరో పది రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో రెండు జలాశయాల్లో నీటి నిల్వ 420 టిఎంసికి చేరుకునే అవకాశం ఉంది. కృష్ణా బోర్డు తాజాగా ఈ రెండు ప్రాజెక్టుల్లో చేరిన నీటి నిల్వలను పరిగణనలోకి తీసుకుని నాగార్జునసాగర్ కుడి, ఎడమ ఆయకట్టులో సగానికి సగం ఆయకట్టు అంటే 10 లక్షల ఎకరాలకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. నాగార్జునసాగర్ ఆయకట్టు కింద 6.25 లక్షల ఎకరాలు, కుడి కాల్వ కింద దాదాపు 15 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం శ్రీశైలంలో పూర్తి స్ధాయి నీటి నిల్వ 215 టిఎంసికి చేరుకుంది. ఈ నీటిని దిగువకు గురువారం ఉదయం వదిలారు. శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టం తగ్గకుండా పర్యవేక్షించాలని ఇప్పటికే కృష్ణాబోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీని ప్రకారం 854 అడుగులకు ఎగువున దాదాపు వంద టిఎంసి నీటి లభ్యత ఉంటుందని అంచనా.
కృష్ణాబోర్డు త్వరలో సమావేశమై ఈ ఏడాదికి నీటి ప్రణాళికను ఖరారు చేయనుంది. వచ్చే ఏడాది జూన్ నెల వరకు రెండు రాష్ట్రాల మంచినీటి అవసరాలకు 70 టిఎంసి నీటిని నిల్వ ఉంచాలి. ఆ పైన వంద టిఎంసి నీటిని రెండు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీటి కేటాయింపుల ప్రాతిపదికన విడుదల చేసే అవకాశం ఉంది. దీని కోసం రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే 122 టిఎంసి నీటిని కేటాయించాలని కృష్ణాబోర్డును కోరింది. కృష్ణాబోర్డు కార్యదర్శిగా పరమేశన్ అనే అధికారిని నియమించారు. అంతకు ముందు ఉన్న సమీర్ చటర్జీని బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీలోగా కృష్ణాబోర్డు సమావేశమై అప్పటికి రెండు జలాశయాల్లో ఉన్న నీటిని పరిగణనలోకి తీసుకుని రబీ సీజన్‌కు నీటిని వదిలే విషయమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
ముందుగా మంచి నీటి అవసరాలకు నీటిని నిల్వ చేసి ఆ తర్వాత మాత్రమే మిగిలిన నీటిని సేద్య రంగానికి మళ్లించాలని ఇప్పటికే కృష్ణాబోర్డు స్పష్టం చేసింది. కాగా రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకంపై ఏకాభిప్రాయం లోపించడం వల్ల తాము చేయగలిగేదేమీ లేదని ముందుగా చర్చల ద్వారా ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని కృష్ణాబోర్డు ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 164 టిఎంసి, పులిచింతలలో 45.77 టింఎంసికి 13 టిఎంసి నీటి లభ్యత ఉంది.