రాష్ట్రీయం

నాగార్జున సాగర్‌కు ఇన్‌ఫ్లో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, అక్టోబర్ 12: నాగార్జునసాగర్ జలాశయానికి శ్రీశైలం నుండి వస్తున్న వరదనీరు కారణంగా సాగర్ జలాశయ నీటిమట్టం క్రమేణా పెరుగుతూ ఉంది. సగటున రోజుకు 4 అడుగుల చొప్పున పెరుగుతూ వస్తుంది. నిన్న మొన్నటి వరకు శ్రీశైలం నుండి విద్యుత్ ఉత్పత్తి ద్వారా విడుదలవుతున్న నీటితో సాగర్‌లో డెడ్ స్టోరేజిలో ఉన్న నీటిమట్టం కనీస స్థాయిని దాటి 526అడుగులకు చేరుకోగా గురువారం సాయంత్రానికి 530 అడుగులకు పెరిగింది. శుక్రవారం నుండి శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా రెండు క్రస్ట్‌గేట్ల నుండి 55,782 క్యూసెక్కులను విడుదల చేస్తుండడంతో దాంతోపాటు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 80వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ జలాశయానికి శ్రీశైలం నుండి 1.30లక్షల క్యూసెక్కులు వచ్చి చేరుకుంటుంది. దీంతో శుక్రవారం సాయంత్రానికి మరో ఐదు అడుగుల మేరకు సాగర్ నీటిమట్టం పెరగనుంది. ప్రస్తుతం సాగర్ జలాశయం నుండి ఎస్‌ఎల్‌బిసి ద్వారా 1350క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి ఎగువ నుండి 86,272క్యూసెక్కుల నీరు వచ్చి చేరుకుంటుండగా ప్రస్తుతం 884.60అడుగుల నీటిమట్టం ఉంది.

చిత్రం..గురువారం సాయంత్రానికి 530 అడుగులకు పెరిగిన సాగర్ నీటిమట్టం