రాష్ట్రీయం

2018 నాటికి పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి: దేవినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 20: 2018 నాటికి పోలవరంతో పాటు రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటిని త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు చేపట్టామని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. 16వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జలవనరులశాఖ ప్రాధాన్యతను గుర్తించి రూ.10వేల కోట్లు కేటాయించారంటూ మోక్షగుండం విశే్వశ్వరయ్య, కెఎల్ రావు తరువాత చంద్రబాబునాయుడు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోగలరన్నారు. ఏది ఏమైనా జలవనరుల పరిరక్షణలో సిఎం కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తున్నారన్నారు. సిఎం క్యాంప్ కార్యాలయం సమీపంలో జలవనరులశాఖ ప్రధాన కార్యాలయాన్ని మంత్రి దేవినేని ఉమా శుక్రవారం పూజాదికాలు నిర్వహించి ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల్లో జరుగుతున్న పనులను ఈ కార్యాలయం నుంచి పర్యవేక్షించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. తద్వారా ఆయా ప్రాజెక్టుల్లో జరుగుతున్న పనుల ప్రగతిని ముఖ్యమంత్రి, మంత్రి కార్యాలయం నుంచే పరిశీలించే అవకాశం ఉండనుంది. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 13 జిల్లాల్లోని జలవనరులపై సమగ్ర సమాచారంతో నివేదికలు రూపొందిస్తున్నామని, వీటినన్నింటిని ఆయా జిల్లాల్లో సామాన్యులకు అందుబాటులో ఉంచి అవగాహన పెంచేలా ప్రయత్నిస్తామని చెప్పారు.

పిపిపి విధానంలో అందరికీ ఇళ్లు

విశాఖపట్నం, నవంబర్ 20: పట్టణాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో గృహనిర్మాణాన్ని కేంద్రం చేపడుతోందని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖల మంత్రి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి 1.93 ఇళ్లు మంజూరు చేశామన్నారు. కొత్తగా పట్టణాల్లో చేపట్టే ఇళ్లను భార్య పేరిట మంజూరు చేస్తారన్నారు. కేంద్ర నిబంధనల మేరకు ఇంటి నిర్మాణ విస్తీర్ణం 30 చదరపు మీటర్లుండాలని, వీటిలో ఎక్కువ, తక్కువలు రాష్ట్రాల అభీష్టం మేరకు మార్చుకోవచ్చన్నారు. ప్రభుత్వ స్థలాల్లో చేపట్టే గృహనిర్మాణ సముదాయాలకు రూ.లక్ష, ప్రైవేటు స్థలాల్లో చేపట్టే సముదాయాలకు రూ.1.5 లక్షలు కేంద్రం ఉచితంగా అందజేస్తుందన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటును కలుపుకుని నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. గతంలో గృహనిర్మాణాలకు సంబంధించి కేంద్రం 6.5 శాతం వడ్డీ రాయితీని ఇచ్చేదని, తాజాగా కేంద్రం తీసుకువచ్చిన మార్పులతో ప్రైవేటు స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారు బ్యాంకులో రుణం తీసుకుంటే కేంద్రం ఇచ్చే మొత్తాన్ని జమచేస్తుందన్నారు.

రాజధానిలో పర్యటించిన బ్రిటన్ బృందం

గుంటూరు, నవంబర్ 20: రాజధాని అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసేందుకు సంసిద్ధత వ్యక్తంచేసిన బ్రిటన్ దేశానికి చెందిన రెండు కంపెనీల ప్రతినిధులు శుక్రవారం అక్కడ పర్యటించారు. సిఆర్‌డిఎ అధికారి చెన్నకేశవరావు నేతృత్వంలో నార్మన్ ఫోస్టర్, రోజర్ కంపెనీల ప్రతినిధులు, జ్యూరీ మెంబర్లు ముగ్గురు, రెవెన్యూ అధికారులు పర్యటనలో పాల్గొన్నారు. ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని పరిశీలించారు. సీడ్ క్యాపిటల్‌లో నిర్మించతలపెట్టిన శాసనసభ, సచివాలయం తదితర ప్రధాన ప్రభుత్వ కార్యాలయలకు సంబంధించిన డిజైన్‌ను రూపకల్పన చేయాలని అధికారులు బ్రిటన్ ప్రతినిధులను కోరారు. అనంతరం జస్టిస్ సిటి ప్రాంతమైన శాఖమూరు గ్రామంలో పర్యటించారు. తర్వాత రాయపూడి గ్రామానికి సంబంధించిన వివరాలు అధికారుల వద్ద నుంచి సేకరించి నేరుగా అమరావతి బయలుదేరి వెళ్లారు. బ్రిటన్ దేశానికి సంబంధించిన రెండు కంపెనీలు ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన డిజైన్లను ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తంచేసిన దృష్ట్యా రెండు కంపెనీల ప్రతినిధులు డిజైన్ తయారుచేసి ఇవ్వాలని కోరినట్లు సిఆర్‌డిఎ అధికారి చెన్నకేశవరావు తెలిపారు.

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం

విశాఖపట్నం, నవంబర్ 20: లక్ష దీవుల పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శుక్రవారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో చెదురు మదురు వర్షాలు, ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

మన్యంలో గంజాయి తోటలు ధ్వంసం
పాడేరు, నవంబర్ 20: విశాఖ ఏజెన్సీలో శుక్రవారం ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది దాడులు చేసి భారీగా గంజాయి తోటలు ధ్వంసం చేశారు. పాడేరు మండలం గొండెలి పంచాయతీ లింగాపుట్టు గ్రామంలోని కొండలపై సాగు చేస్తున్న గంజాయి తోటలపై ఎక్సైజ్ సిబ్బంది జరిపిన దాడుల్లో దాదాపు రెండు కోట్ల రూపాయల విలువ చేసే గంజాయి మొక్కలను ధ్వంసం చేసారు. లింగాపుట్టు గ్రామంలోని గిరిజనుల సాగు భూముల్లో భారీ ఎత్తున గంజాయి సాగు చేస్తున్నట్టు సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు.. సిఆర్‌పిఎఫ్, సివిల్ పోలీసు బలగాల సహకారంతో దాడులకు వ్యూహం రచించారు. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ బాబ్జిరావు నేతృత్వంలోని దాదాపు 150 మంది ఎక్సైజ్ సిబ్బంది, పోలీసు బలగాలు లింగాపుట్టు గ్రామ కొండలను చుట్టుముట్టి, 30 ఎకరాల భూమిలో సుమారు 90 వేల గంజాయి మొక్కలను ధ్వంసం చేసారు.