రాష్ట్రీయం

భగ్గుమన్న రోహిణి ఆస్పత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 16: వరంగల్ నగరం సుబేదారి ప్రాంతంలోని రోహిణి ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ లీకైంది. అదే సమయంలో షార్ట్ సర్క్యూట్ తలెత్తడంతో ఆగ్నిప్రమాదం సంభవించి ఇద్దరు రోగులు మృత్యువాత పడ్డారు. రోగులు, అగ్నిమాపక దళం, ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం సంభవించిన సమయంలో ఆస్పత్రిలో కనీసం 150మంది రోగులు చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. ప్రమాదంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భూపాలపల్లి జిల్లా వెంకటరావుపల్లికి చెందిన కుమారస్వామి, కాటారం మండలానికి చెందిన మల్లమ్మ సజీవదహనమయ్యారు. మంటలనుంచి తప్పించుకునే ప్రయత్నంలో నలుగురికి గాయాల య్యాయి. పొగ కమ్మేయడంతో సిబ్బందితోపాటు మరికొందరు పేషెంట్లు స్పృహ కోల్పో యారు. సాయంత్రం ఐదుగంటల సమయంలో కుమారస్వామికి సర్జరీ చేస్తుండగా రెండో అంతస్తులోని ఆపరేషన్ థియేటర్‌లో ఆక్సిజన్ సిలిండర్ లీక్ అయింది. అదే సమయంలో షార్ట్‌సర్క్యూట్ ఏర్పడటంతో మంటలు వ్యాపించాయ. ఇది గమనించి
ఆపరేషన్ థియేటర్‌లో ఉన్న వైద్యులు, సిబ్బంది పేషెంటును వదిలి పారిపోయారు. మంటలు ఇతర విభాగాలకు వ్యాపించటం, దట్టమైన పొగ వ్యాపిస్తుండటాన్ని గమనించిన ఆసుపత్రి సిబ్బంది, పేషెంట్ల వెంట వచ్చిన వ్యక్తులు ఆసుపత్రిలోని వివిధ వార్డుల్లోని పేషెంట్లను హుటాహుటిన వివిధ విభాగాల నుంచి బయటకు తరలించారు. ఈ సందర్భంలో తలెత్తిన తొక్కిసలాటతో కొందరు గాయపడ్డారు. దట్టమైన పొగ కారణంగా మరికొందరు స్పృహతప్పి పడిపోయారు. ఆసుపత్రి ఆరుబయట, రోడ్డుపైన స్ట్రెచర్లపై, ఎమర్జన్సీ మంచాలపై రోగులకు చికిత్స అందిస్తునే వారిని నగరంలోని ఎంజిఎం ప్రభుత్వ ఆసుపత్రికి, వివిధ ప్రైవేటు ఆసుపత్రులకు అంబులెన్సులలో తరలించారు. అగ్నిప్రమాదం సమాచారంతో నగరంలోని నాలుగు ఫైర్‌స్టేషన్‌ల నుంచి అగ్నిమాపక వాహనాలు చేరుకుని సుమారు గంటకుపైగా శ్రమించి మంటలను అదుపుచేశాయ. అగ్నిప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రి పరిసరాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేసారు. ఆసుపత్రి ముందున్న కాజీపేట- హన్మకొండ ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేసి ఇతర మార్గాల్లో మళ్లించారు. రోహిణి ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదం విషయం తెలిసి అప్పుడే నగరానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆసుపత్రికి చేరుకుని ప్రమాద సంఘటనపై ఆరా తీసారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను సందర్శించారు. వివిధ ఆసుపత్రుల్లో చేర్చిన రోగులకు సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోహిణి అసుపత్రి అగ్నిప్రమాద సంఘటనపై విచారణ జరిపిస్తామని కడియం తెలిపారు. అగ్నిప్రమాదం విషయం తెలిసిన వెంటనే అర్బన్, రూరల్ జిల్లా కలెక్టర్లు ఆమ్రపాలి, ప్రశాంత్ జీవన్ పాటిల్, జాయింట్ కలెక్టర్లు దయానంద్, హరిత, పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు, పలువురు డిసిపిలు, ఏసిపిలు, ఇతర పోలీసు అధికారులు, వైద్యశాఖ అధికారులు ఆసుపత్రికి చేరుకుని పేషెంట్లను ఇతర ఆసుపత్రులకు తరలించడానికి సహకరించారు. ఒకపక్క అగ్నిప్రమాదం, మరోపక్క పేషెంట్లను ఆసుపత్రి నుంచి బయటకు తీసుకురావటం, వారికి వైద్యం అందిస్తునే ఇతర ఆసుప్రతుకలు తరలించే ప్రయత్నాలతో సంఘటన ప్రాంతం యుద్ధవాతావరణాన్ని తలపించింది.