రాష్ట్రీయం

లక్ష్యం.. 53 లక్షల టన్నులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: తెలంగాణలో 2017-18 సంవత్సరానికి సంబంధించి ధాన్యం సేకరణ విధానాన్ని (పాలసీ) పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. గతంలో జారీ చేసిన పాలసీలో అనేక మార్పులు, చేర్పులు చేశారు. తాజాగా ప్రకటించిన విధానం ప్రకారం ధాన్యం కొనుగోలులో ఎలాంటి అక్రమాలకు, అవకతవకలకు అవకాశం లేకుండా ఫకడ్బందీ చర్యలు ప్రకటించారు. 2017-18 సంవత్సరానికి 53 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఖరీఫ్‌లో 28 లక్షల టన్నులు, రబీలో 25 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని నిర్ణయించారు. ఒకవేళ ఇంతకు మించి ధాన్యం ఎక్కువగా మార్కెట్లోకి వచ్చినా కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. రైతులు ఇబ్బందికి గురికాకుండా చూస్తామని పౌరసరఫరాల కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. ధాన్యం సేకరణ అంశం లక్షలాది మంది రైతులకు సంబంధించింది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలని తమ సిబ్బందికి సూచించామన్నారు. వచ్చే వారంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ప్రారంభమవుతుందని, గత ఏడాది కంటే 10 లక్షల టన్నుల ధాన్యం అధికంగా మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నామన్నారు.