రాష్ట్రీయం

పొలంలో వలకు చిక్కిన చిరుత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాల, అక్టోబర్ 17: మన్నారుపల్లి అటవీ ప్రాంత సమీపంలో పంట పొలాల వద్ద వేటగాళ్లు వేసిన వలలో మంగళవారం చిరుత చిక్కుకుంది. ఐరాల చుట్టు పక్కల ఉన్న అటవీ ప్రాంతం నుంచి పంట పొలాల్లోకి ఆహారాన్ని వేటాడుతూ వచ్చిన చిరుత వేటగాడి వలలో చిక్కింది. విషయం తెలుసుకున్న ఐరాల పోలీసులు, పశ్చిమ అటవీశాఖ కార్యాలయానికి సమాచారం అందించారు. దీంతో డిఎఫ్‌ఓ చక్రపాణిరెడ్డి, సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అటవీ సిబ్బంది చాకచక్యంగా చిరుతకు మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. చిరుత పూర్తిగా మత్తులోకి జారుకుందని నిర్దారణకు వచ్చిన తరువాత బోన్‌లో బంధించి తిరుపతి జూపార్క్‌కు తరలించారు. దీనితో అటవీ, రెవెన్యూ, పోలీస్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వేటగాడు వేసిన ఈ ఉచ్చు చిరుత
నడుం భాగానికి బిగిసుకుపోవడంతో చిరుత గాయాలకు లోనైనట్లు డాక్టర్ అరుణ్‌కుమార్ తెలిపారు. ఇది మగ చిరుత అని దీని వయస్సు 5నుంచి 6 సంవత్సరాలు ఉండచవ్చని ఆయన తెలిపారు. అయితే సంఘటనా స్థలంలోనే ఈ చిరుతకు చికిత్స చేయాలని నిర్ణయించినా స్థానికులు ఎగబడడంతోవీలులేకపోయిందని, చిరుతను జూకు తీసుకెళ్లి అక్కడ ప్రత్యేక వైద్య చికిత్సలు చేయనున్నట్లు ఆయన వివరించారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్ ప్రసాద్‌బాబు, ఎస్సై శివశంకర్, అటవీ అధికారులు తదిరులు పాల్గొన్నారు.

చిత్రం.. వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న చిరుత