రాష్ట్రీయం

బాబుది దుష్టపాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం, అక్టోబర్ 17: సిఎం చంద్రబాబు మోసపూరిత పాలన కొనసాగిస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని వైకాపా అధినేత జగన్ ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో మంగళవారం చేనేత రిలే దీక్షలను విరమింప చేసిన అనంతరం బహిరంగసభలో మాట్లాడిన జగన్ ‘దున్నపోతు మీద వాన కురిసిన చందంగా, చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లు’ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఎన్నికల సమయంలో అధికారం కోసం అన్నివర్గాలకు ఇబ్బడిముబ్బడిగా హామీలిచ్చిన చంద్రబాబు, 45 నెలలు కాలంలో వాటిని ఏమేరకు నెరవేర్చారో ప్రజలకు చెప్పాలన్నారు. రైతుల రుణాలు రూ.82 వేల కోట్లకు పైగా ఉంటే కేవలం రూ.24 వేల కోట్లు మాత్రమే మాఫీచేశారన్నారు. వడ్డీకి కూడా సరిపోని విధంగా రుణమాఫీ ఉందన్నారు. రూ.395 కోట్ల చేనేతల రుణాలుంటే అందులో రూ.110 కోట్లు ఇదే ధర్మవరంలో మాఫీచేస్తున్నట్లు ప్రకటించి అవి కూడా పూర్తి చేయకుండా కేవలం రూ.90 కోట్లు మాత్రమే విదిల్చారన్నారు. 2014 ఎన్నికల సమయంలో చేనేత మగ్గం గుంతలోకి దిగి ఫొటోలు దిగి అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కష్టాలను తీరుస్తానని పలికిన
చంద్రబాబు వారి కష్టాలను అస్సలు పట్టించుకోలేదని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో అన్నివర్గాలు సంతృప్తిగా ఉన్నారని సిఎం చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేతలకు రూ.1000 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటుచేసి జిల్లాకు హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటుచేసి హౌస్ కం వర్క్‌షెడ్ నిర్మిస్తానని హామీ ఇచ్చిన అదే చంద్రబాబు అనంత జిల్లాలో 65 మందికి పైగా నేతన్నలు చనిపోతే ఏ ఒక్కనాడు వారి గురించి పట్టించుకోలేదన్నారు. కేవలం 11 మందికి అరకొరగా సహాయం చేసి చేతులు దులుపుకున్నారన్నారు.
గత 37 రోజులుగా ముడిపట్టు రాయితీ కోసం ధర్మవరంలో నేతన్నలు ధర్నా చేస్తుంటే ఏమాత్రం కూడా పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో ఆప్కో కనుమరుగుకు ఈ ప్రభుత్వానిదే బాధ్యతన్నారు.
చేనేతలకు జగన్ హామీలు
చేనేత రిలే నిరాహార దీక్షలు విరమింపచేసిన జగన్ మోహన్‌రెడ్డి కార్మికులకు హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హ్యాండ్లూమ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి తద్వారా చేనేతలకు రుణాలు ఇప్పించడంతోపాటు ప్రతి చేనేత కార్మికుడికి రూ.లక్ష వరకు వడ్డీ లేని రుణం అందజేస్తామన్నారు. అలాగే ప్రస్తుతం వున్న ముడిపట్టు రాయితీ రూ.1000ను రూ.2 వేలకు పెంచుతామన్నారు. అలాగే ప్రతి చేనేత కార్మికునికి 45 ఏళ్లకే చేనేత పింఛన్ అందేవిధంగా వయో పరిమితిని సడలించడమేగాక రూ.2 వేలు పింఛన్ ఇస్తామన్నారు. జిల్లాలో హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటు చేయడంతోపాటు ప్రతి చేనేత కార్మికునికి హౌస్ కం వర్క్‌షెడ్ ఎంత ఖర్చు అయినా నిర్మించి ఇస్తామన్నారు. అలాగే రాష్ట్రంలో ఏ ఒక్కరూ తమకు ఇల్లు లేదు అని చెప్పుకునే విధంగా 25 లక్షల గృహ నిర్మాణాలు చేపడతామన్నారు.
నవరత్నాలు అమలు చేయాలని డిమాండ్
మీకు చేతనైతే తాము ప్రకటించిన నవరత్నలను అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు జగన్ సవాల్ విసిరారు. నవరత్నాలు పథకాన్ని తాము ప్రకటిస్తున్నపుడు తన పార్టీ నాయకులు కొన్ని సందేహాలు వ్యక్తం చేశారన్నారు. చంద్రబాబు ముందుగా ఈ పథకాలను అమలుచేస్తే సంతోషపడే మొదటి వ్యక్తిని తానేనని వైకాపా నేతలతో చెప్పానన్నారు. ఒకవేళ చంద్రబాబు నవరత్నలను అమలుచేస్తే తాము అధికారంలోకి వచ్చాక వాటికంటే రెట్టింపు ఇస్తామని ప్రకటిస్తానని పార్టీ నాయకులకు చెప్పానన్నారు.

చిత్రం..అనంతపురం జిల్లా ధర్మవరంలో మంగళవారం జరిగిన సభలో ప్రసంగిస్తున్న వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి