రాష్ట్రీయం

27నుంచి వర్షాకాల అసెంబ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఈనెల 27నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈమేరకు శాసనసభ కార్యదర్శి వేదాంతం నర్సింహచార్యులకు మంగళవారం ప్రతిపాదన పంపించింది. దీంతో 26న బిజినెస్ అడ్వజరీ కమిటీ (బిఎసి) సమావేశం నిర్వహించి ఎన్ని రోజులు సభ నిర్వహించేది ఖరారు చేస్తారు. శాసనసభ వర్షాకాల సమావేశాలను నెల పాటు నిర్వహించాలని బిఏసిలో ప్రతిపాదించడంతో పాటు 15నుంచి 20 రోజుల పని దినాలు ఉండేలా షెడ్యూల్ ఖరారు చేయాలని పాలకపక్షం తరఫున ప్రతిపాదించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. శాసనసభ ఎన్ని రోజులు నిర్వహిస్తే మండలి సమావేశాలూ అన్ని రోజులు నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. శాసనసభలో చర్చించే ప్రతీ అంశాన్నీ మండలిలోనూ చర్చించాలన్నారు. శాసనసభ సమావేశాల నిర్వహణపై మంగళవారం ప్రగతి భవన్‌లో శాసనసభ వ్యవహారాల మంత్రి టి హరీశ్‌రావు, ఉప ముఖ్యమంత్రి మహబూబ్ అలీ, మంత్రులు ఈటల రాజేందర్, కె తారకరామారావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, నాయిని నరసింహారెడ్డి, మహేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి తదితరులతో కెసిఆర్ చర్చించారు. ‘శాసనసభ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చ జరగాలి.
సభ్యులు లేవనెత్తే ప్రతీ అంశానికి సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. ప్రతిపక్షాలు ఏ అంశాన్ని చర్చకు తెచ్చినా చర్చకు సిద్ధం. ప్రజలకు అన్ని విషయాలు శాసనసభ వేదికగా వివరించాలి. దీనికి మంత్రులు సమాయత్తం కావాలి’ అని సిఎం సూచించారు. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. వాటిని సభకు, ప్రజలకు వివరించాలి. సభ్యుల సందేహాలను నివృత్తి చేయడం తో పాటు విలువైన సూచనలను స్వీకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. నెలపాటు సభ నిర్వహించాలని పాలకపక్షం తరఫున ప్రతిపక్షాలను కోరుదామన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని రోజులు సభ నిర్వహించాలని కోరితే అన్ని రోజులూ నిర్వహించడానికి ప్రభుత్వానికేమి అభ్యంతరం లేదన్నారు. సభ హూందగా జరగాలి, ప్రతీ అంశంపై చర్చ జరగాలన్నారు. మాతృభాష పరిరక్షణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైనా సభలో చర్చించాల న్నారు. ఇంటర్మీడియట్ వరకు కచ్చితంగా తెలుగు ఒక సబ్జెక్టుగా ఉండాలనే నిబంధన విధించడం వల్ల మాతృభాషను పరిరక్షించుకోవడంతో పాటు తెలుగు పండిట్లకు
ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. గురుకుల విద్యాలయాల్లో కూడా తెలుగును ఒక సబ్జ్‌క్టుగా బోధించబోతున్నట్టు చెప్పారు. అలాగే హైదరాబాద్‌లో నిర్వహించే ప్రపంచ తెలుగు మహాసభలపైనా సభలో చర్చించాలన్నారు. సమావేశాలు ముఖ్యమైనవిగా భావించాలి. ప్రజల కోసం ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై మంత్రులు స్పష్టమైన ప్రకటనలు చేయాలి. వివిధ అంశాలపై సభ్యులంతా మాట్లాడే విధంగా కూలంకషంగా చర్చ జరగాలని సిఎం అన్నారు. కొన్ని బిల్లులను కూడా సభలో ఆమోదించుకోవాల్సి ఉందన్నారు. సభలో గతంలో అనేక అంశాలపై తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించిందని గుర్తు చేశారు. అయినప్పటికీ కేంద్రం నుంచి స్పందన రాలేదన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు, హైకోర్టు విభజన, ఎస్టీలకు రిజర్వేషన్ కోటా పెంపు, సింగరేణి ఉద్యోగులకు ఆదాయపన్ను మినహాయింపు, ఉపాధి హామీ పనులు వ్యవసాయానికి అనుసంధానం, ఎయిమ్స్ స్థాపన తదితర అంశాలపై కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో మళ్లీ తీర్మానాలు చేసి వత్తిడి పెంచుదామని సిఎం వివరించారు.

చిత్రం..వర్షాకాల సమావేశాల నిర్వహణపై మంత్రులతో చర్చిస్తున్న సిఎం కెసిఆర్